ఇండియన్ నేవీలో చేరాలనేది మీ కల అయితే ఈ అద్భుతమైన అవకాశం మీ కోసమే.

అగ్నివీర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తోంది ఇండియన్ నేవీ.

అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, అగ్నివీర్ ఎంఆర్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలైంది.

మొత్తం 1365 పోస్టులను భర్తీ చేయనుండగా.. 273 పోస్టులను మహిళల కోసం కేటాయించింది.

వయసు పరిమితి: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 2022 నవంబర్ 01 మరియు 2006 ఏప్రిల్ 30 మధ్యలో జన్మించి ఉండాలి. అంటే 17.5 నుంచి 21 ఏళ్ల లోపు ఉండాలి.  

విద్యార్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ తో 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ మూడింటిలో ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి.

పెళ్లి కాని వారికి మాత్రమే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందాలంటే పెళ్ళై ఉండకూడదు.   

జీతం: నెలకు రూ. 30 వేలు, ఏటా స్థిరమైన పెంపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా (రాత పరీక్ష), పీఎఫ్టీ అండ్ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. 

పరీక్ష ఫీజు: రూ. 550 + 18% జీఎస్టీ

దరఖాస్తు చివరి తేదీ: 15 జూన్ 2023