హైదరాబాద్ లో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలని ఎంతోమందికి కల ఉంటుంది.

కానీ హైదరాబాద్ లో స్థలం కొనడం అంటే 50, 60 లక్షలు అవుతుంది. ఇల్లు కట్టుకోవాలంటే కోటి పైనే అవుతుంది.

దీంతో చాలా మంది శివారు ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

అయితే సిటీకి మరీ దూరంగా కాకుండా ఓ 10 కి.మీ. దూరంలో కూడా తక్కువ బడ్జెట్ లో స్థలాలు దొరుకుతున్నాయి.

150 గజాల స్థలం 25 లక్షల లోపే దొరికే ఏరియా హైదరాబాద్ లో ఉంది.

ఎల్బీ నగర్ కి 8 కి.మీ., వనస్థలిపురం ఏరియాకి 12 కి.మీ. దూరంలో బాలాపూర్ ఏరియా ఉంది.

ఎల్బీ నగర్, వనస్థలిపురం ఏరియాల్లో గజం రూ. 45 వేల నుంచి రూ. 55 వేలు ఉంది.

అదే 10 కి.మీ. దూరంలో ఉన్న బాలాపూర్ కి వెళ్తే గజం రూ. 16 వేలకే దొరుకుతుంది.

150 గజాల స్థలం కొనాలంటే రూ. 25 లక్షలు అవుతుంది.

ఈ ఏరియాలో ఆయా ప్రాంతాలను బట్టి రూ. 23 లక్షలకే 136 గజాలు, రూ. 25 లక్షలకే 200 గజాల స్థలాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఏరియాలో 1000 చదరపు అడుగుల ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కనుక కనిష్టంగా రూ. 29 లక్షలు అవుతుంది.

అదే సగటు ధర అయితే రూ. 38 లక్షలు అవుతుంది. గరిష్ట ధర ఐతే రూ. 48 లక్షలు అవుతుంది.

ఈ బాలాపూర్ ఏరియాలో స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మించుకున్న, కట్టిన ఇల్లు కొనుక్కున్నా తక్కువ బడ్జెట్ లో సొంతింటి కల నెరవేరుతుంది.

గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు.

అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.