జీవో 111 ఎత్తివేతతో 111 పరిధిలో ఉన్న 84 గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.
స్థలం మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఈ జీవో 111 పరిధిలో ఉన్న గ్రామాలు బెస్ట్ ఛాయిస్ అని నిపుణులు చెబుతున్నారు.
సిటీకి దగ్గరగా ఉన్న అజీజ్ నగర్, మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ వంటి ఏరియాల్లో స్థలాలు కొనుగోలు చేస్తే తక్కువ సమయంలో మంచి లాభాలను పొందవచ్చునని అంటున్నారు.
ఈ ప్రాంతాలన్నీ కలిసి హైదరాబాద్ ని తలపించేలా మరో నగరంగా ఏర్పడనున్నాయి.
అజీజ్ నగర్ హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ కి 45 నిమిషాల నుంచి గంటలో రావచ్చు. రింగ్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది.
హైదరాబాద్ తో పోలిస్తే జీవో 111 పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందుతాయి.
విశాలమైన రోడ్లు, మంచినీటి సదుపాయం, రోడ్డుకి ఇరువైపులా గ్రీన్ బెల్ట్ వంటివి వస్తాయి.
ఈ ఏరియాలో ఎకరం రూ. 2 కోట్లు ఉంది.
డెవలప్ చేసిన ప్లాట్ ని గజం రూ. 10 వేలు, రూ. 15 వేలు చొప్పున విక్రయిస్తున్నారు.
ఇప్పుడు కనుక ఒక 100 గజాలు లేదా 150 గజాల స్థలం కొనుక్కుని పెట్టుకుంటే రెండేళ్లలో ఊహించని లాభాలు చూడవచ్చునని అంటున్నారు.
రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలు పెట్టుబడి పెడితే మంచి లాభాలను చూడవచ్చునని అంటున్నారు.
అమ్ముకున్నా అక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నా కూడా భూమి ధర భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ పెరగడానికి కొంచెం సమయం పట్టినా గానీ పెట్టిన పెట్టుబడికి నష్టం అయితే ఉండదని అంటున్నారు.
సిటీకి దగ్గరగా ఉండేలా స్థలాలు కొంటే మంచిదని సూచిస్తున్నారు.
గమనిక: ఈ ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉండవచ్చు. స్థలం కొనుగోలు చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.