క్రికెట్ ప్రపంచం మొత్తం ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫీవర్‌లో ఉంది. ఈసారి మాత్రం ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. అయితే సౌత్ ఆఫ్రికా- నెదర్లాండ్స్ మ్యాచ్ ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సౌత్ ఆఫ్రికాపై నెదర్లాండ్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఒక్క గెలుపు మాత్రమే కాదు.. సౌత్ ఆఫ్రికాకి ఉన్న సెమీస్ అవకాశాలను కూడా నెదర్లాండ్స్ జట్టు దెబ్బకొట్టింది. ఈసారి సెమీస్‌కు కూడా క్వాలిఫై కాకుండా చేశారు. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి ఎప్పుడూ ఉంటుందని క్రికెట్ పండితులు చెబుతుంటారు. వరల్డ్ కప్- బ్యాడ్ లక్- సౌత్ ఆఫ్రికా ఈ మూడింటిని విడయదీయలేమంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
అయితే సౌత్ ఆఫ్రికా దురదృష్టాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ కప్ లాంటి కీలక టోర్నమెంట్లలో సౌత్ ఆఫ్రికా ఎప్పుడూ చేతులెత్తేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో సౌత్ ఆఫ్రికా అస్సలు అదృష్టం కలిసి రాదు. ఇప్పటికే గతంలో జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్లలో కీలక మ్యాచుల్లో వర్షం పడి రద్దు కావడం. లేదా ఆ జట్టులో జరిగే రాజకీయాల వల్ల మ్యాచ్‌లపై ప్రభావం పడటం చూశాం. జట్టు మొత్తం ఫామ్‌లో ఉన్నా కూడా ఏదో ఒక కారణం చేత దక్షిణాఫ్రికా పరాజయం పాలవుతూ ఉంటుంది. కొంతమంది అయితే సౌత్ ఆఫ్రికాకి వరల్డ్ కప్ గండం ఉందంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో అత్యంత స్ట్రాంగ్ జట్టుగా కొనసాగుతూ.. 2007 నుంచి ఇప్పటి వరకు ఒక్క టీ20 వరల్డ్ కప్ సాధించకపోవడాన్నే దానికి ఉదాహరణగా చూపిస్తున్నారు.
Pure magic from Roelof van der Merwe!
Iconic moments like this from every game will be available as officially licensed ICC digital collectibles with @0xFanCraze
Visit https://t.co/8TpUHbQikC today to see if this could be a Crictos of the Game. pic.twitter.com/zABUCFTlw1
— ICC (@ICC) November 6, 2022
ఇంక ఈ టోర్నమెంట్ విషయానికి వస్తే.. సౌత్ ఆఫ్రికాకి ఆస్ట్రేలియా పిచ్‌లు బాగా సెట్ అవుతాయి. వారి బ్యాటర్లకు, బౌలర్లకు బౌన్సీ పిచ్‌లలో ఆడటం అలవాటే. కానీ, ఎప్పటిలాగానే వర్షం వారిని గట్టిగానే దెబ్బకొట్టింది. వార్మప్ మ్యాచ్‌తోనే సౌత్ ఆఫ్రికాని వర్షం వెంటాడింది. బంగ్లాదేశ్ జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ తర్వాత తొలి మ్యాచ్ జింబాబ్వేతో ఆడారు. తప్పకుండా గెలిచే మ్యాచ్ అని అందరికీ తెలుసు. కానీ వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం లేకుండా పోయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. పాకిస్తాన్ మ్యాచ్ కూడా అలాగే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 185 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ని 14 ఓవర్లలో 142 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చారు. సౌత్ ఆఫ్రికా 33 పరుగుల తేడాతో ఆ మ్యాచ్‌ని ఓడిపోయింది. ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాని ఓడించి సెమీస్ ఆశలను గల్లంతు చేసింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు సౌత్ ఆఫ్రికా ఇంక వరల్డ్ కప్ కొట్టదా అంటూ ప్రశ్నిస్తున్నారు.