టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి గత కొంతకాలంగా తన స్థాయి ప్రదర్శన రావడంలేదు. గత మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై హాఫ్ సెంచరీ చేసినా.. అది రోహిత్ మార్క్ ఇన్నింగ్స్ అయితే కాదు. టీమిండియా ఓపెనర్‌గా అగ్రెసివ్ స్టార్ట్‌తో లాంగ్ ఇన్నింగ్స్‌లు ఆడే రోహిత్ శర్మ.. ప్రస్తుతం చెత్త షాట్లు ఆడి చేజేతుల వికెట్ పారేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లోనూ రోహిత్ శర్మ ఇదే దారిలో వెళ్తున్నాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్ ఎంతో కీలకమైన ప్లేయర్. కానీ.. ఇలా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుతుండటంపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రోహిత్ ఇలా చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకోవడం వెనుక కేఎల్ రాహుల్ ఉన్నట్లు క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
కేఎల్ రాహుల్ చెత్త బ్యాటింగ్‌కు బలవుతున్న రోహిత్..
టీమిండియా వైస్ కెప్టెన్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ జోడి మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ.. జట్టుకు భారంగా మారాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొన్న రాహుల్ కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పైన 12 బంతుల్లో 9 పరుగులు చేసి అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ఇక ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ 14 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 9 పరుగులు మాత్రమే చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 34 బంతులు ఆడిన రాహుల్ చేసిన పరుగులు మాత్రం 22. ఇది అతని చెత్త ఫామ్‌ను స్పష్టంగా తెలియజేస్తుంది.
బ్యాటింగ్ అప్రోచ్‌తోనే అసలు సమస్య..
కేఎల్ రాహుల్ పరుగులు చేయలేకపోవడానికి అసలు సమస్య అతని బ్యాటింగ్ అప్రోచ్ అని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. మోర్ డిఫెన్సివ్‌గా ఆడుతున్నాడని.. ఇంత ఆత్మరక్షణ ధోరణితో ఆడితే ఆస్ట్రేలియా పిచ్‌లపై పరుగులు చేయడం కష్టమని అంటున్నారు. ఎటాకింగ్ ప్లేతోనే రాహుల్ తన బ్యాడ్ ఫామ్‌ను నుంచి బయటపడగలడని పేర్కొంటున్నారు. కేఎల్ రాహుల్ భయపడుతూ బ్యాటింగ్ చేస్తుంటే.. ప్రత్యర్థి బౌలర్లకు మరింత ఉత్సహం, కాన్ఫిడెన్స్ వస్తుందని క్రికెట్ అభిమానులు సైతం అంటున్నారు. రాహుల్ డాట్స్ బాల్స్ ఆడుతుండటం వల్ల.. పవర్ ప్లేలో పరుగులు రావడంలేదు. దీంతో మరో ఎండ్ నుంచి రోహిత్ శర్మ పరుగుల కోసం ఓవర్ డైనమిక్‌గా బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో.. కొని సార్లు రోహిత్ శర్మ వేగంగా ఆడే క్రమంలో మంచి బంతులకే సైతం అనవసరపు షాట్లు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్‌తో రోహిత్ శర్మపై ఒత్తిడి పెరుగుతోంది.
కొంత టైమ్ తీసుకుని క్రీజ్‌లో కుదురుకోడానికి ఇది టెస్టు, వన్డే కాదు కదా.. టీ20 ఫార్మాట్. తొలి ఆరు ఓవర్ల పవర్‌ప్లేలోనే ఓపెనర్లు వీలైనన్ని ఎక్కువ పరుగులు పిండుకోవాలి. కానీ.. రాహుల్ ఫామ్‌లేమితో టీమిండియాకు ఓపెనింగ్ సమస్యగా మారింది. అసలు పవర్‌ప్లేలో పరుగులు రావడమే లేదు. ఒకటి రెండు వికెట్లు తొలి రెండు, మూడు ఓవర్లలోనే పడిపోతుండటంతో తర్వాత వచ్చే బ్యాటర్లు.. వేగంగా ఆడలేకపోతున్నారు. కొంత సమయం తీసుకుని వికెట్లు కాపాడుకునే ప్రయత్నంలో రన్‌రేట్ పడిపోతుంది. అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే రోహిత్‌శర్మకు కేఎల్ రాహుల్ డిఫెన్సివ్ బ్యాటింగ్ శాపంగా మారింది. రాహుల్ రన్స్ చేయలేకపోతున్నా.. కనీసం సింగిల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేసినా.. రోహిత్ తన పని తాను చేసుకుంటాడు. కానీ.. అతను ఓవర్ మెయిడెన్ చేయడం.. 9, 10 బంతులను డాట్స్ ఆడటంతో రోహిత్‌పై ఒత్తిడి ఎక్కువవుతోంది. ఇలా ఫామ్‌లో లేని రాహుల్ తాను పరుగులు చేయక.. తనతో పాటు రోహిత్‌ను కూడా పరుగులు చేయనియడం లేదని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ రాహుల్ మంచి టీ20 ప్లేయరే.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఫామ్‌లో లేని సమయంలో మరీ డాట్స్ ఆడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తే.. బెటర్ అని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
KL Rahul Never Disappoints us 😌#KLRahul𓃵 #INDvsSA pic.twitter.com/6JMM859KG5
— Rishi Gurjar (@theRishiGurjar) October 30, 2022
Uske bure waqt mein uska saath na dene wale so-called KL Rahul fans mujhe unfollow/block krde. 🙏I am very disappointed with such people! 😞 pic.twitter.com/tYy3LejvVK
— Kunal Yadav (@kunaalyaadav) October 30, 2022