ఐపీఎల్ వేలంలో 16 కోట్లకు పైగా ధర పలికాడు. అన్ని మ్యాచ్‌లు ఆడితేనే అతనికి ఆ మొత్తం ఇస్తారు. లేకుంటే కోతే. అయినా కూడా బెన్‌స్టోక్స్ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యేందుకే నిర్ణయించుకున్నాడు. దానికి కారణం కూడా చాలా చిన్నది.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 సీజన్ చివర్లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన స్టోక్స్ కొన్ని మ్యాచ్‌లకు దూరం అవుతుండటంపై చెన్నైసూపర్ కింగ్స్ అభిమానులు నిరాశ చెందుతున్నాడు. ఎందుకంటే స్టోక్స్‌ను చెన్నై ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఒక వేళ చెన్నై సెమీస్, ఫైనల్స్‌కు చేరితే.. అలాంటి కీలక మ్యాచ్‌ల్లో బెన్ స్టోక్స్ లేకుంటే.. చెన్నై ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలోనే ఈ షాకింగ్ విషయంపై సీఎస్‌కే ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెన్ స్టోక్స్ ఆల్‌రౌండర్‌గా టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉంటాడని, చెన్నైకు ఐదో టైటిల్ ఖాయమని అంతా భావించారు. కానీ.. తాజా నిర్ణయంతో సీఎస్‌కే ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
పైగా స్టోక్స్ చివర్లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావాడానికి కారణమైన విషయం కూడా చాలా చిన్నది కావడం విశేషం. జూన్ 1వ తేదీ నుంచి ఇంగ్లండ్ పసికూన ఐర్లాండ్‌తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం ప్రిపేర్ అయ్యేందుకే బెన్ స్టోక్స్ ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ మే 28న ముగుస్తుంది. దీంతో.. అప్పటి వరకు ఉండకుండా కాస్త ముందుగానే ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లి ఐర్లాండ్‌తో ఆడే ఒకే ఒక టెస్టు కోసం బెన్ స్టోక్స్ ప్రిపేర్ అవుదామని భావిస్తున్నాడంట అందుకే.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
అయితే.. ఐపీఎల్‌లో పూర్తి మ్యాచ్‌లు ఆడకుంటే స్టోక్స్‌కు ఇచ్చే రూ.16.25 కోట్లలో కొంత కోత విధిస్తారు. దీనికి కూడా సమ్మతించిన స్టోక్స్ ఐపీఎల్‌కు దూరం అయ్యేందుకు నిర్ణయించుకోవడం విశేషం. ఐపీఎల్‌కు స్టోక్స్ దూరం అవుతున్నాడని కొంతమంది ఇండియన్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నా.. డబ్బు కంటే దేశానికి స్టోక్స్ ఇచ్చే ప్రాధాన్యత చూసి అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఐర్లాండ్ లాంటి పసికూనతో మ్యాచ్ అంటే నిద్రలోంచి లేచివెళ్లిన ఆడినా స్టోక్స్ రాణించగలడు. అలాంటిది వారితో ఒక టెస్టు కోసం కోట్ల రుపాయాల డబ్బు వదులుకుని మరి స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అలాగే ఐపీఎల్ 2022లో కూడా స్టోక్స్ ఆడలేదు. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఐపీఎల్ ఆడితే శారీరకంగా అలిసిపోతామని భావించి, ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. అతనితో పాటు సామ్ కరన్ కూడా అలాగే చేశాడు. ఫలితంగా టీ20 వరల్డ్ కప్ 2022ను ఇంగ్లండ్ గెలిచింది. ఐపీఎల్‌లో ఆడితే కోట్లు వస్తాయని తెలిసినా.. వాళ్లు దేశం తరఫున కప్పు గెలవడంపైనే దృష్టి పెట్టారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ben Stokes will be skipping the final stages of IPL 2023 to prepare for Ireland Test and The Ashes.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 22, 2023