Priya Paramita Paul: ఆమె ఓ సగటు మహిళ. కుటుంబం.. ఉద్యోగం తప్ప ఇంకేమీ తెలియదు. అత్తింటికి సేవలు చేస్తూ బతికితే చాలనుకుంది. కానీ, భర్త వేరే అమ్మాయి మీద ఉన్న మోజుతో ఆమెను వదిలేశాడు. జీవితం అగాథంలో పడ్డట్టుగా అయ్యింది. ఉద్యోగం పోయింది. అప్పులు చుట్టుముట్టాయి. అయినా ఆమె బెదరలేదు.. పోరాడింది. తన కల కోసం ముందుకు సాగింది. విజయం సాధించింది. అదే ప్రియ పరిమిత పాల్ సెక్సెస్ స్టోరీ..
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ప్రియ పరిమిత పాల్ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసేది. 2016లో ఆమెకు ఓ వ్యక్తితో పెళ్లయింది. ఆమె అత్తింటివారితో కలిసి కొన్ని రోజులు సంతోషంగా గడిపింది. అయితే, భర్త వేరే అమ్మాయి మోజులో పడి ఆమెను పట్టించుకోవటం మానేశాడు. కొద్దిరోజుల తర్వాత ప్రియతో తెగదెంపులు చేసుకున్నాడు. ఆమె తట్టుకోలేకపోయింది. భర్తను వెనక్కు తెచ్చుకునే ప్రయత్నం చేసింది.
కానీ, అతడు పట్టించుకోలేదు. రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్లలో ఎంతో డిప్రెషన్‌కు గురైంది. దాని కారణంగా ఉద్యోగం కూడా పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత అప్పులు మీద పడ్డాయి. ఎంతో కష్టం మీద ఆ డిప్రెషన్‌నుంచి బయటపడింది. తన చిరకాల కలైన అందాల పోటీల్లో రాణించాలనుకుంది. ఎంతో శ్రమించింది. బరువు తగ్గింది.
శరీరకంగానే కాదు మానసికంగానూ ధృడంగా తయారైంది. మిసెస్ ఇండియా వరల్డ్ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఆగస్టు 2022లో జరగనున్న మిసెస్ ఇండియా వరల్డ్‌లో పాల్గొననుంది. ప్రియ సక్సెస్ స్టోరీ మహిళలు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. మరి, ఈ ప్రియ పరిమిత పాల్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Marriage: ఇదెక్కడి వింత.. 30 ఏళ్ల కిందట పురిటిలో మరణించిన పిల్లలకి ఇప్పుడు పెళ్లి!