నేటికాలంలో దాదాపు ప్రతి పని టెక్నాలజీపైనే ఆధారపడి జరుగుతుంది. మొబైల్ ఫోన్ల ద్వారా లావాదేవీలు కూడా అందులో ఓ భాగం. ఈ ఆన్ లైన్ లావాదేవిలే సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. అనేక మార్గాల్లో వేలకు వేలు డబ్బులను కొల్లగొడుతున్నారు. అకస్మాత్తుగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు మాయమై పోతోంది. వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారాగానీ, నంబర్ల నుంచిగానీ నేరుగా వెబ్‌సైట్ లింకులు పంపించడం, వాటిని నొక్కితే ఖాతాల నుంచి డబ్బు మాయమవడం పరిపాటిగా మారింది. ఇలాంటి మోసాలపై బ్యాంకు మేనేజర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కొన్ని రోజుల క్రితం వాట్సాప్ గ్రూపుల్లో “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా లింక్ వచ్చింది. ఈ సినిమాకున్న క్రేజ్ తో చూడాలన్న ఆసక్తి చాలామందిలో పెరిగింది. దీంతో వచ్చిన లింక్ ఓపెన్ చేశారు. రెండు నిమిషాలు సినిమా వచ్చింది. తర్వాత కొత్త లింక్ రావడంతో కొందరు దాన్ని క్లిక్ చేశారు. అంతే వారి అకౌంట్ లోని డబ్బు మాయమైనాయి. ఎవరికి చెప్పుకోలేక వారిలో వారే బాధపడుతున్నారు. అలానే అందరు నిత్యం ఉపయోగించే ఫోన్ ప్లే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్ లను సైతం నకిలీవి సృష్టించి మోసం చేస్తున్నారు.
కడపలోని ఓ మొబైల్ షాపునకు ఇద్దరు యువకులు వచ్చి ఫోన్ కొన్నారు. ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించారు. “అమౌంట్ రిసీవుడ్ సక్సెస్‌ఫుల్లీ” అంటూ రావడంతో మొబైల్ షాపు యజమాని ఓకే అన్నారు. తర్వాత చెక్ చేస్తే ఒక్క పైసా కూడా ఆయన బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. తీరా చూస్తే నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లంపులు చేశారని తేలింది. ఇలా నిత్యం వివిధ రకాలు జనాలను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఆన్ లైన్ చెల్లింపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కొత్త నంబర్ల నుంచి వచ్చే వెబ్‌సైట్ లింకులపై క్లిక్ చేయకూడదు.ఎవరైనా క్యాష్ ఇవ్వండి. ఫోన్ పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్ ద్రావా పంపితే అమౌంట్ వచ్చినట్లు చూపుతుంది.
కానీ మన ఖాతాలో జమ కాదు. ఇటీవల హిట్ అయిన సినిమాల పేర్లతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్ చేయడం వల్ల మన ఖాతాల్లో డబ్బు మాయమవుతుంది.మన ఫోన్ ఇతరులకు ఇవ్వొద్దు. క్యూఆర్ కోడ్ వంటి వివరాలను వారి ఫోన్ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.ఆన్‌లైన్ బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు గోప్యంగా ఉంచుకోవాలి. ఫోన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‌వర్డ్‌లు నమోదు చేయకూడదు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.