సాధారణంగా చిత్రపరిశ్రమలో కొంతమంది హీరోయిన్స్ గా సినిమాలు చేయకపోయినా.. గ్లామర్ విషయంలో ఎప్పుడూ అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంటారు. అలాంటి వారిలో మంచు లక్ష్మి ఒకరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీ.. మెల్లగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తనదైన డ్రెస్సింగ్ స్టయిల్ తో.. తెలుగు భాషకు ఆంగ్ల మాధ్యమాన్ని జోడించిన మాటలతో ప్రేక్షకులకు దగ్గరైంది. కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చేసినప్పటికీ, ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే.. మంచు లక్ష్మి అనగానే అందరికీ ఆమె మాటతీరు మాత్రమే గుర్తొస్తుంది.
ఇప్పుడు అదే వాక్చాతుర్యంతో అప్పుడప్పుడు బుల్లితెర ప్రోగ్రామ్స్ ని హోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూనే.. కొత్త కొత్త ట్రెండీవేర్ లో ఫోటోషూట్స్ చేసి గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి తాజాగా రెడ్ కలర్ రోజ్ టైప్ ట్రెండీ డ్రెస్ లో అభిమానుల కళ్ళు చెదిరే విధంగా ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
సరికొత్త స్టైలిష్ లుక్స్ తో ఎర్రగులాబీ కన్నా అందంగా కనిపిస్తోంది మంచు లక్ష్మి. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే నెటిజన్స్ కూడా లేటెస్ట్ పిక్స్ లో లక్ష్మిని చూసి ఫిదా అవుతున్నారు. దీపావళి సందర్భంగా ముస్తాబైన లక్ష్మిని చూసి.. గ్లామరస్ లక్ష్మిబాంబ్ లా ధగధగ మెరుస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక రెడ్ డ్రెస్ లో మంచు లక్ష్మికి సంబంధించి ఫొటోలతో పాటు వీడియో కూడా నెట్టింట ట్రెండ్ అవుతుండటం విశేషం. అప్పుడప్పుడు మంచు లక్ష్మి ఇలాంటి అందాల ట్రీట్స్ ఇవ్వడం మామూలే అనుకుంటున్నారు ఫాలోయర్స్. ఇప్పుడైతే ఆహాలో చెఫ్ మంత్రా అనే ప్రోగ్రాం హోస్ట్ చేస్తోంది మంచు లక్ష్మి.