ఆమెని చూస్తే అచ్చతెలుగమ్మాయిలా ఉంటుంది. కానీ మలయాళీ. తండ్రి ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్. తల్లి కూడా హీరోయిన్ గా చేసింది. తెలుగులోనూ చిరంజీవితో ‘పున్నమినాగు’ సినిమాలో నటించింది. తెలుగులో పెద్ద అవకాశాలు రాకపోవడం వల్ల దక్షిణాదిలో వేరే భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ చిన్నారి.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా చిత్రాలు చేస్తూ అలరిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కీర్తి సురేష్. తొలి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించింది. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి మూవీస్ చేసింది గానీ హిట్స్ కొట్టలేకపోయింది. ఇక ‘మహానటి’లో సావిత్రి పాత్రలో జీవం పోసి.. ఏకంగా నేషనల్ అవార్డు దక్కించుకుంది. దీని తర్వాత మన్మథుడు, గుడ్ లక్ సఖి, రంగ్ దే సినిమాలు చేసింది గానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చేసింది.
ఇక ఈ సినిమా హిట్ కావడంతో అప్పట్లో కీర్తి సురేశ్ చిన్పప్పటి ఫొటోలు కొన్ని వైరల్ గా మారాయి. అందులో తల్లి మేనక పక్కన క్యూట్ గా కూర్చుని ఉన్న పాపనే కీర్తి సురేశ్. ఇక కీర్తి తల్లి మేనక.. అప్పట్లో చిరుతో ‘పున్నమినాగు’ చేసింది. ఇప్పుడు కీర్తి సురేశ్ అదే చిరంజీవితో ‘భోళా శంకర్’ చేస్తోంది. ఇందులో మెగాస్టార్ కి ఆమె చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. అలా తల్లికూతుళ్లు ఇద్దరూ చిరుతో నటించే అవకాశం కొట్టేశారు. కీర్తి సురేశ్ చిన్నప్పటి ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: పెళ్లిపీటలు ఎక్కనున్న హీరోయిన్ కీర్తి సురేశ్.. వరుడు ఎవరంటే?
View this post on Instagram
A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)Set featured image