ప్రముఖ సీరియల్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయేషాపై ఆమె మాజీ ప్రియుడు దేవ్ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె ఓ మోసగత్తె అని, తన అవసరాల కోసం మగాళ్లను వాడుకుంటుందని అన్నాడు. తాజాగా, ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. దేవ్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ అయేషా చెన్నైలోని అమృతా కాలేజ్‌లో చదువుతున్న సమయంలో నాకు పరిచయం అయింది. మా ఇద్దరి ఫ్రెండ్ ద్వారా అయేషాతో నాకు పరిచయం ఏర్పడింది. మా పరిచయం మొదట స్నేహంగా మారింది. ఆ తర్వాత రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టాం. పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆమె ఊరికి వెళ్లాను. ఆమె ఇంట్లో వాళ్లను అయేషాను నాకిచ్చి పెళ్లి చేయమని అడిగాను.
వాళ్లు నన్ను బెదిరించారు. అయేషాను మర్చిపోమన్నారు. నేను మళ్లీ చెన్నైకి వచ్చేశా. నా ప్రయత్నం కారణంగా అయేషాకు నా మీద ప్రేమ పెరిగింది. నా కోసం ఇంటినుంచి పారిపోయి చెన్నైకి వచ్చేసింది. నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను. నేనే ఆమెకు సీరియల్స్‌లో అవకాశం ఇప్పించాను. 2019లో మా ఇద్దరికీ బ్రేకప్ అయింది. ఆమెకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. తర్వాత రెండేళ్లకు మళ్లీ పెళ్లి చేసుకుంది. ఆమె ప్రస్తుతం యోగేష్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. అతడు నా కజిన్ లవర్. మొదట్లో అయేషా, యోగేష్ అక్కా, తమ్ముడు లాగే ఉండేవారు.
తర్వాత ప్రేమలో పడ్డారు. గతంలో ఆమె విష్ణు అనే సీరియల్ యాక్టర్‌తో కూడా ప్రేమలో ఉండింది. ఆమె మనసు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక రిలేషన్ నుంచి మరో దానికి మారుతూ ఉంటుంది. ఒకప్పుడు డీ అన్న అక్షరం ఉన్న చైన్ ధరించేది. ఇప్పుడు వై అనే అక్షరం ఉన్న చైన్ ధరిస్తోంది. ఆమె తన రెండో భర్త నుంచి విడాకులు ఇంకా తీసుకోలేదు. కాబట్టి, ఇంకో పెళ్లి చేసుకోవటానికి అవకాశం లేదు’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అయేషాపై దేవ్ చేసిన సంచలన కామెంట్లు కోలీవుడ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.