తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇప్పుడు బుల్లితెరపై తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ సెలబ్రెటీ టాక్ షోకి హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో బిగ్ బాస్ షోకి యన్టీఆర్, నాని లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇక హీరోయిన్లు పలు రియాల్టీ షోలకు జడ్జీలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను థియేటర్లో పగలబడి నవ్వించేలా చేస్తున్న దర్శకుడు అనీల్ రావిపూడి సైతం బుల్లితెరపై తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.. ‘కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్’ పేరుతో ఓ కామెడీ షోతో ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాడు.
దర్శకుడు అనీల్ రావిపూడి ‘కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్’ షో తో తొలిసారి గా ఆహ ద్వారా ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ షోకి జబర్ధస్త్ సుడిగాలి సుధీర్ యాంకర్ గా కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ షో ట్రైలర్ కి విశేష స్పందన వచ్చింని నిర్వాహకులు తెలియజేశారు. అనీల్ రావిపూడి స్టైలిష్ లుక్ తో చేతిలో సూట్ కేస్ తీసుకొని ‘అరె.. స్టాక్స్ దుమ్ము లేపడానికి అందరూ రెడీగా ఉండడి.. బొమ్మ దద్దరిలి పోవాలా’ అంటు ఎంట్రీ ఇచ్చాడు. అందరినీ అలరించే కామెడీ షో ‘కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్’ నవంబర్ నుంచి మొదలు కానుంది. ఈ షోని ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్ ఓటీటీలోకి తొలిసారిగా అడుగు పెడుతున్నాడు.
దర్శకుడిగా అందరి మనసు దోచిన అనీల్ రావిపూడి మొదటి సారి ఆహా ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ సత్తా చాటుకునేందుకు ‘కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్’ గొప్ప వేధిక అవుతుంది.. ఆద్యంతం అందరినీ నవ్వించేందుకు సిద్దమవుతున్న ఈ షోలో నేనూ భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా మొదటి ఓటీటీ డెబ్యూ.. నన్ను ప్రేక్షకులు మనసారా ఆశీర్వదిస్తారని కోరకుంటున్నాను’ అన్నారు. కామెడీ చిత్రాలతో అలరించే అనీల్ రావిపూడి బుల్లితెరపై ఎలా నవ్విస్తారో కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే.
ఇది చదవండి: ‘కాంతార’ సబ్జెక్టుతో నేషనల్ అవార్డు మూవీ! త్వరలోనే తెలుగులోకి..