సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు సోషల్ మాద్యమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రా లాంటి సోషల్ మాద్యమాల్లో తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం.. అవి చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతూ వైరల్ చేయడం కామన్ అయ్యింది. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న క్రేజీ హీరోయిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసిన బ్యూటీ.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా.. ఎవరో కాదు కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 చిత్రంలో నటించి కుర్రాళ్ల మతులు పోగొట్టిన అందాల భామ పాయల్ రాజ్ పూత్. ఈ చిత్రంలో నెగిటీవ్ షేడ్స్ లో నటించింది. అయినా తన అందాల ఆరబోతతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. 1990 డిసెంబర్ 5 న ఢిల్లీలో పాయల్ రాజ్ పూత్ జన్మించింది. పాయల్ తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్,నిర్మల్ రాజ్ పుత్. ప్రస్తుతం ఈ అమ్మడు ముంబైలో నివసిస్తుంది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే తపన ఉన్న పాయల్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది.
ఈ క్రమంలోనే మొదట తన కెరీర్ బుల్లితెరపై ప్రారంభించింది. తర్వాత పంజాబ్ లో మూవీ ‘చన్నా మేరేయా’ చిత్రంతో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. సెన్సేషన్ డైరెక్టర్ వర్మ శిష్యుడు అయిన అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన ‘ఆర్ఎక్స్ 100 ’ చిత్రంతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించిన పాయల్ తర్వాత నటించిన చిత్రాలు పెద్దగా కలిసి రాలేదు. మంచు విష్ణుతో జిన్నా చిత్రంలో నటించింది.
సినిమాలో పాత్ర ప్రాధాన్యతను బట్టి స్కిన్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడను అంటూంది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు ఇంతర భాషా చిత్రాల్లో నటిస్తుంది పాయల్ రాజ్ పూత్. ఇక సోషల్ మాద్యమాల్లో పాయల్ కి సంబంధించిన ఫోటో షూట్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాయల్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో తెగ వైరల్ అవుతుంది.