జింబాబ్వేతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని టీమిండియా తొలుత జింబాబ్వేను 189 పరుగులకే కట్టడి చేసి.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(81 నాటౌట్), శుభ్‌మన్ గిల్(82 నాటౌట్) 190 పరుగులు లక్ష్యాన్ని ఊదేశారు. కాగా.. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వండంతో ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు తొలి విజయం దక్కింది. గతంలో కేఎల్ కెప్టెన్ వ్యవహరించిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. కాగా.. కేఎల్ రాహుల్‌కు తొలి విజయం వచ్చిన ఆనందాన్ని కూడా అభిమానులు ఉండేలా లేరు. జింబాబ్వేపై మ్యాచ్ గెలుపును అటుంచి.. అసలు కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఎందుకు రాలేదని మండిపడుతున్నారు. జింబాబ్వేతో సిరీస్ తర్వాత ప్రతిష్టాత్మక ఆసియా కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ స్వౌడ్‌లో కేఎల్ రాహుల్ ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు దిగేది అతనే. పైగా కేఎల్ రాహుల్ దాదాపు మూడు నెలలు ఆటకు దూరమయ్యాడు. గాయాలు, ఆపరేషన్, కరోనా ఇలా పలు కారణాలతో కేఎల్ రాహుల్ జట్టులో లేడు. ఇంత పెద్ద విరామం తర్వాత జట్టులోకి వచ్చిన రాహుల్ వచ్చిన అవకాశాన్ని సైతం డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోని వృథా చేశాడని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వే టూర్ కోసం తొలుత ప్రకటించిన జట్టులో అసలు కేఎల్ రాహుల్ లేడు. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా బీసీసీఐ సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. కానీ.. పర్యటనకు కొన్ని రోజుల ముందు రాహుల్ ఫిట్‌నెస్ టెస్ట్ పాసై అవ్వడంతోనే.. హుటాహుటిన అతన్ని జింబాబ్వే టూర్‌కు వెళ్లే జట్టులో చేరుస్తూ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇంత హడావిడిగా కేఎల్ రాహుల్‌ను జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేయడం వెనుక ఒక కారణం ఉంది. చాలా రోజులుగా ఆటకు దూరంగా రాహుల్ ఆసియా కప్ లాంటి టోర్నీకి ముందు కొంత ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుందని సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. కానీ.. తీరా మ్యాచ్ సమయానికి శిఖర్ ధావన్‌కు తోడుగా శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా పంపి.. కేఎల్ రాహుల్ డ్రెస్సింగ్‌రూమ్‌లో కాళ్లు చాపుకుని కూర్చున్నాడు. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ.. ఆసియా కప్ టీమ్‌లో లేరు. అలాంటప్పుడూ గిల్‌ను మిడిల్డార్‌లో ఉండి. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రావాల్సిందంటూ క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. కాగా.. తన స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా పంపడం తన నిర్ణయం కాదని.. టీమ్ మేనేజ్‌మెంట్ సలహా మేరకు అలా నడుచుకున్నానని కేఎల్ రాహుల్ మ్యాచ్ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు. తొలి మ్యాచ్‌లో మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను మిస్ చేసుకున్న కేఎల్ రాహుల్.. మరి రెండో మ్యాచ్‌లోనైనా ఓపెనర్‌గా వస్తాడేమో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: చాహల్-ధనశ్రీ పచ్చటి కాపురంలో నిప్పులు పోసిన టీమిండియా క్రికెటర్! First win for KL Rahul as an Indian captain. pic.twitter.com/9Hfkan9kcA — Johns. (@CricCrazyJohns) August 18, 2022 Today KL Rahul register his first win as captain of India. pic.twitter.com/IKN7lG9jmg — CricketMAN2 (@ImTanujSingh) August 18, 2022