“క్రాక్” మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ నుండి వచ్చిన “ఖిలాడి” మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
గాంధీ (రవితేజ) ఒక అనాథ. అతణ్ని రాజశేఖర్ అనే పెద్ద మనిషి ఆదరిస్తారు.
తనని పెంచి, పెద్ద చేసిన రాజశేఖర్ అంటే గాంధీకి విపరీతమైన గౌరవం.
కానీ.. హోం మినిస్టర్ గురుసింగం (ముకేష్ రుషి) సీఎంకు సంబంధించిన పది వేల కోట్ల రూపాయల డబ్బుల డీల్ లో రాజశేఖర్ ఇరుక్కుంటాడు.
ఈ క్రమంలోనే గాంధీ తన కుటుంబాన్ని సైతం కోల్పోతాడు. అయినవాళ్ళని గాంధీనే చంపాడని గాంధీ జైలు పాలవుతాడు.
ఆ సమయంలో గాంధీ కూతురు అనాధ అవుతుంది. ఆ పాపకి సైకాలజీ స్టూడెంట్ అయిన పూజ (మీనాక్షి చౌదరి) అండగా నిలుస్తుంది.
కోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి గాంధీకి బెయిల్ వచ్చేలా చేస్తుంది. కానీ.. అప్పుడే గాంధీ నిజస్వరూపం బయట పడుతుంది.
ఇంతకీ ఎవరీ గాంధీ? పది వేల కోట్ల డబ్బుల డీల్ తో అతడికి సంబంధమేంటి? చివరికి ఆ డబ్బు ఏమైంది? అన్నదే మిగిలిన కథ.
సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా.. కథ, కథనం అనేవి మాత్రం చాలా ముఖ్యం. ఇక సస్పెన్స్ యాక్షన్ మూవీకి లాజిక్స్ చాలా ముఖ్యం. కానీ.. ఖిలాడిలో ఇవే మిస్ అయ్యాయి.
హీరో క్యారెక్టరైజేషన్ ని హైలెట్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంతా ఒక అబద్దంగా, లాజిక్ లేకుండా చూపించడం దగ్గరే ఖిలాడి స్థాయి పడిపోయింది.
సెకండ్ ఆఫ్ లో మాత్రం మాస్ మహారాజా ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ సీక్వెన్స్ లకి కొదవలేదు.
అయితే.. ప్రతి 15 నిమిషాలకి ఒకసారి వచ్చే ట్విస్ట్ లలో ఎక్కడా లాజిక్ కనిపించదు.
దర్శకుడు రమేష్ వర్మ కమర్షియల్ మీటర్ పై పెట్టిన శ్రద్ద కథాకథనాలపై పెట్టి ఉంటే ఖిలాడి స్థాయి మరోలా ఉండేది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఖిలాడి మూవీ లాజిక్ మిస్ అయ్యి కిచిడిలా తయారైంది.