‘బిగ్ బాస్ 5 తెలుగు’ గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఈ సీజన్ లో దాదాపు తక్కువ ఫ్యాన్ బేస్ తో వచ్చిన కంటెస్టెంట్లు సెలబ్రిటీలు అయిపోయారు.

 ప్రస్తుతం అంతా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే దానిపైనే చర్చ నడుస్తోంది.

తమ అభిమాన కంటెస్టెంట్ ను గెలిపించుకునేందుకు ఫ్యాన్స్ ఓటింగ్ చేస్తున్నారు.

 హాట్ స్టార్ యాప్, మిస్డ్ కాల్స్ తో తమ ఓట్లు ను పోల్ చేస్తున్నారు.

టాప్-5 లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారికే బగ్ బాస్ టైటిల్ దక్కుతుందని నిర్వాహకులు చెప్తుంటారు.

ఈ సీజన్ కు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లెక్కలు లీక్ అయినట్లు తెలుస్తోంది.

హాట్ స్టార్- మిస్డ్ కాల్ లిస్ట్ లో ఆ కంటెస్టెంట్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నట్లు అతని దరి దాపుల్లో కూడా ఏ కంటెస్టెంట్ లేడని తెలుస్తోంది.

అదే జరిగితే అతనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అవుతాడు. అతను ఎవరో కాదు వీజే సన్నీ.

అవును లీకుల లెక్కల ప్రకారం వీజే సన్నీనే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

షణ్ముఖ్ కు కూడా చాలా గ్యాప్ ఉన్నట్లు సమాచారం.

అదే జరిగితే బయట టాక్ ప్రకారం వీజే సన్నీ ఈ సీజన్ టైటిల్ విన్నర్ అయిపోయినట్లే.

మిగిలిన వారిలో షణ్ముఖ్ రెండో స్థానంలో, సింగర్ శ్రీరామచంద్ర మూడో స్థానంలో, మానస్  కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

 కానీ, ఇవి అధికారిక లెక్లు కాదు కాబట్టి.. ఆదివారం వరకు ఆగాల్సిందే అసలు విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి. 

బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.