భారతీయులకు, రైల్వేలకు విడదీయరాని అనుబంధం ఉందని అంటారు.
సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా బస్సు కన్నా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు.
ఉద్యోగస్తులు, వ్యాపారాలు చేసుకునేవారు ఎక్కువ రైలు ప్రయాణాలకే మొగ్గు చూపిస్తుంటారు
రైలు ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త వెల్లడించింది.
వందేభారత్ సహా పలు రైళ్లలో ప్రయాణించేవారికి చార్జీలను 25 శాతం వరకు దగ్గింగే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ రైళ్లలో ఈ బెనిఫిట్ వర్తింపజేయాలని తెలిపింది.
ఏసీ రైళ్ల ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఇప్పటికే బుకింగ్ చేసుకున్నవారికి ఈ డిస్కౌంట్ వర్తించదని.. అలాగే తిరిగి చెల్లింపు కూడా ఉండదని తెలిపింది.
రిజర్వేషన్ చార్జెస్, సూపర్ ఫాస్ట్ సర్ చార్జ్, జీఎస్టీ.. యథావిధిగా ఉంటాయి.
టిక్కెట్ మూల ఛార్జీలో గరిష్ఠంగా 25 శాతం డిస్కౌంట్ రైలు ప్రయాణికునికి లభిస్తుంది.
సెలవుడు, పండుగల సమయంలో ప్రత్యేకంగా నడిచే రైళ్లకు ఈ డిస్కౌంట్ వర్తించదు.
టికెట్ ధరల డిస్కౌంట్ సత్వరమే అమలులోకి వస్తుంది. 6 నెలల ముందుగానే టికెట్ బుక్ చేసుకునే వారికి కూడా డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ స్కీమ్ ఎంపిక చేసిన ఏసీ కోచ్ జర్నీకి మాత్రమే వర్తిస్తుంది.. సాధారణ స్లీపర్, జనరల్ క్లాస్ లో ప్రయాణించే సామాన్యులకు ఈ ప్రయోజనం వర్తించదు.