ప్రస్తుతం దేశంలో టెలికాం వార్ నడుస్తోంది. వినియోగదారులను ఎట్రాక్ట్ చేయడానికి టెలికాం కంపెనీలు పలు ప్లాన్స్ ని ఆఫర్ చేస్తున్నాయి.

ఇప్పటికే ఎయిర్ టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు దూసుకుపోతుండగా.. వీటితో పోటీగా బీఎస్ఎన్ఎల్ వచ్చింది.

మిగతా కంపెనీల కంటే తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  

తక్కువ ధరకే మంచి రీఛార్జ్ ప్లాన్ కావాలని కోరుకునే వారికి బీఎస్ఎన్ఎల్ రూ. 138 ప్లాన్ కరెక్ట్ గా సరిపోతుంది.

ప్రతి రోజూ 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ తో 28 రోజుల ప్లాన్ ని రూ. 139కే బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది.

మిగతా కంపెనీలు డైలీ 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు కలిగిన ప్లాన్ కోసం రెండింతలు వసూలు చేస్తున్నాయి.

ప్రతి రోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు కలిగిన 28 రోజుల ప్లాన్ కోసం ఎయిర్ టెల్ రూ. 299 ఛార్జ్ చేస్తుంటే.. జియో రూ. 239 ఛార్జ్ చేస్తుంది.

ఇదే ప్లాన్ వొడాఫోన్ ఐడియాలో కావాలనుకుంటే రూ. 299 అవుతుంది. వీటి కంటే తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ అందజేస్తుంది.

రూ. 139 ప్లాన్ లో అపరిమిత కాల్స్ తో పాటు డైలీ 1.5 జీబీ డేటా వస్తుంది. అయితే ఎస్ఎంఎస్ లు మాత్రం ఉండవు.

మాకు ఎస్ఎంఎస్ లు అవసరం లేదనుకునేవారు ఈ ప్లాన్ ఎంచుకోవడం ఉత్తమం.

ఒకవేళ ఎస్ఎంఎస్ లు కావాలి అనుకుంటే కనుక రూ. 187 రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఇందులో డైలీ 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.  

డైలీ 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్ లతో కూడిన 28 రోజుల ప్లాన్ కి ఎయిర్ టెల్ లో రూ. 265 అవుతుంది.

 అదే వొడాఫోన్ ఐడియాలో రూ. 269, జియోలో రూ. 209 అవుతుంది. ఇదే ప్లాన్ ని బీఎస్ఎన్ఎల్ కేవలం రూ. 186కే అందిస్తుంది.

ప్రతి రోజూ 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు కలిగిన 28 రోజుల ప్లాన్ కావాలనుకుంటే బీఎస్ఎన్ఎల్ లో రూ. 269కే వస్తుంది.

ఇదే ప్లాన్ ఎయిర్ టెల్ లో కావాలనుకుంటే రూ. 359, జియోలో ఐతే రూ. 299 అవుతుంది. అదే వొడాఫోన్ ఐడియా అయితే 30 రోజుల వ్యాలిడిటీతో రూ. 368, రూ. 369కి ఇస్తుంది.

మిగతా టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ ని అందిస్తుంది.