సీఎం మనవడు అంటే రాజు గారి జీవితం, బార్న్ విత్ సిల్వర్ స్పూన్ లా, పూలపాన్పులా ఉంటుంది అనేదే అందరి మైండ్ లో రిజిస్టర్ అవుతుంది.
కానీ దీనికి విరుద్ధంగా ఓ మాజీ సీఎం మనవడు జీవిస్తున్నారు. ఒకప్పటి సీఎం మనవడు అయ్యుండి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు?
అసలు సెక్యూరిటీ గార్డుగా పని చేయాల్సిన అవసరం ఏముంది?
ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మనవడు శ్రీధర్ గాంధీ ఇప్పుడు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు.
ఎల్ అండ్ టీ కంపెనీలో కాంట్రాక్ట్ బేస్ మీద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు.
ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
అప్పటి నాయకులు కొందరు ఎలాంటి అవినీతి మరకలు లేకుండా జీవించారు. అందుకే తమ పిల్లలకు గానీ, పిల్లల పిల్లలకు
గానీ పెద్దగా ఆస్తులు పోగేసుకోలేదు.
చాలా మంది నాయకులు పదవిని దుర్వినియోగం చేయకుండా సాధారణ జీవితం గడిపారు.
అలాంటి వారిలో దామోదరం సంజీవయ్య ఒకరు. ఆయన మనవడు శ్రీధర్ గాంధీ కూడా అంతే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
తన తండ్రి రిటైర్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో పని చేశారని.. తనకు మాత్రం రాజకీయాలంటే ఆసక్తి లేదని.. అందుకే వెళ్లలేదని అన్నారు.
రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడ పెద్దల పేరు చెడగొడతానేమో అన్న భయంతో ఆగిపోయినట్లు ఆయన వెల్లడించారు.
ఒక్క పూట తిన్నా గానీ నిజాయితీగా సంపాదించినదై ఉండాలని.. ఈ ఉద్యోగం పట్ల సంతోషంగా ఉన్నానని అన్నారు.
ఇంకో ఏడాదిలో ఈయన రిటైర్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం ఈయన అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన సతీమణి వెల్లడించారు.
అయినా గానీ సహాయం కోసం ఎవరి దగ్గర చేయి చాచే అవసరం తనకు లేదని అంటున్నారు.
ఒకింత బాధగా ఉన్నా కూడా దామోదరం సంజీవయ్య మనవడిగా జీవిస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.
నిజంగా అవకాశం ఉండి కూడా రాజకీయాల్లోకి రాకుండా.. ఆయన తాత గారైన దామోదరం సంజీవయ్య పేరు వాడుకోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్న శ్రీధర్ గాంధీకి సెల్యూట్ చేయాల్సిందే.