సమంత ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే!

ఈ సినిమా విడుదలైన 2010 సంవత్సరంలోనే ఆమె నటించిన నాలుగు సినిమాలు థియటర్లలోకి వచ్చాయి.

వాటిలో ‘మాస్కోవిన్‌ కావేరీ’ ఒకటి. ఈ సినిమాలో ఆమె రాహుల్‌ రవీంద్రన్‌తో కలిసి నటించారు.

ఇక అప్పటినుంచి ఇద్దరి మధ్యా మంచి అనుబంధం కొనసాగుతోంది.

తాజాగా, రాహుల్‌ గురించి ఆమె ఓ పోస్టు పెట్టారు.

‘‘ మీకు తెలిసిన ఓ మంచి వ్యక్తిని తీసుకోండి.. ఆ వ్యక్తిని వందతో మల్టిప్లై చేయండి.

అలా చేస్తే వాళ్లు ఎంత మంచోళ్లు అవుతారో.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అంత మంచోడు.

రాహుల్‌ రవీంద్రన్‌ నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటాను’’ అని పేర్కొన్నారు.

ఈ పోస్టుపై రాహుల్‌ రవీంద్రన్‌ స్పందించాడు. ఓ రిప్లై కూడా ఇచ్చాడు.

‘‘ పాప. ఇప్పుడు ఏడిపిస్తావా ఏంటి?.. నేను కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను’’ అని అన్నాడు.

ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.