వర్షాకాలం వస్తుంటే చాలు ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అందరూ జాగ్రతగా ఉండాలని వైద్యులు ముందే సూచిస్తున్నారు.

ప్రధానంగా వర్షాకాలంలో కొన్ని రకాల వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది.

ఇంతకు వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏంటి?

ఆ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో డెంగ్యూ, టైఫాయిడ్, జలుబు, దగ్గు వంటి వ్యాధులు వస్తాయి.

ఇవే కాకుండా కలరా, ఫ్లూ, డయేరియా వంటి వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఈ వ్యాధుల రాకుండా ఉండేందుకు నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

ఇంట్లోకి దోమలు రాకుండా తెరలను వాడడంతో పాటు మస్కిటో కాయిల్స్, క్రీములను వాడాలి.

కలుషితమైన నీరు తాగకుండా, ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి.

ఇతరులు వాడిన ఎలాంటి వస్తువును కూడా మనం వాడకూడదు. దగ్గినా, తుమ్మిన కర్చీఫ్ ఖచ్చితంగా వాడాలి.

చల్లటి నీరు తాగకుండా గోరు వెచ్చని నీళ్లు తాగడం మంచిది.

ఇంట్లోకి వెళ్లే ముందు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.