ఈ రోజుల్లో చాలా మంది నేలపై కూర్చొని తినడమే మర్చిపోయారు.
ఈ టెక్నాలజీ యుగంలో అంతా డైనింగ్ టేబుల్స్ పై కూర్చొని తినడం అలవాటు చేసుకున్నారు.
దీంతో చాలా మటుకు అందరూ డైనింగ్ టేబుల్స్ మీదే భోజనం చేస్తున్నారు.
కానీ, నేలపై కూర్చొని భోజనం చేయడం ద్వారా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
నేలపై కూర్చొని భోజనం చేయడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నేలపై కూర్చొని తినడం ద్వారా చాలా రకాల ఆరోగ్య ప్రయోజలనున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు.
నేలపై కాళ్లు ముడుచుకుని వంగి తినడం ద్వారా శరీరమంతా రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది.
సాధారణంగా కాళ్లను క్రాస్ పెట్టి నేలపై కూర్చొని తినడం ద్వారా రక్త ప్రసరణ జరిగి తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.
నేలపై కూర్చొని భోజనం చేయడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
ఇదే కాకుండా మీరు తినే ఆహారంపై కూడా దృష్టి పెట్టడానికి అవకాశం చాలా వరకు ఉంటుంది.
కిందకు వంగి లేవడం ద్వారా ఉదర కండరాలు సక్రమంగా పని చేయడంతో పాటు కడుపులో ఉన్న యాసిడ్ స్రవం పెరుగేందుకు దోహదపడుతుంది.
తద్వారా అన్ని రకాల నొప్పులు తగ్గడమే కాకుండా మీ జీర్ణ వ్యవస్థ సౌకర్యంతంగా జరగడానికి సహాయపడుతుంది.
మొత్తానికి డైనింగ్ టేబుల్ పై కూర్చొని భోజనం చేయడం కన్నా నేలపై కూర్చొని తినడం అన్ని రకాలుగా మెలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.