ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంటాయి.
ఈ క్రమంలో హస్త కళాకారులకు కేంద్ర ప్రభుత్వం నెలకు 8 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది.
హస్తకళల ఉత్పత్తులకు ఆదరణ లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కళాకారులకు ప్రతి నెలా రూ. 8 వేల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.
కేంద్ర జౌళి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
కుండలు తయారుచేసే వారికి, ఆభరణాలు చేసే వారికి, వడ్రంగులకు, చేనేత కార్మికులకు ఇలా నైపుణ్యం కలిగిన చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందజేస్తుంది.
ఈ పథకానికి దేశంలో ఉన్న హస్త కళాకారులూ ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
2023 మార్చి 31 నాటికి 60 సంవత్సరాలు వయసు నిండిన వారు ఈ పథకానికి అర్హులు.
కుటుంబ వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.
మెరిట్ సర్టిఫికెట్ పొందిన హస్త కళాకారులు, హస్తకళల్లో శిల్పి గురు పురస్కారం, జాతీయ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం పొందిన కళాకారులు కూడా అర్హులే.
దరఖాస్తు చేసుకోవాలంటే సమర్పించవలసిన పత్రాలు:
హస్త కళాకారుడు లేదా హస్త కళాకారిణి గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు
మండల రెవెన్యూ అధికారి లేదా కలెక్టర్ జారీ చేసిన వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం
ఆధార్ తో లింక్ అయి ఉన్న జాతీయ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ నంబరు
ఒకవేళ వైకల్యం ఉంటే కనుక దానికి సంబంధించిన పత్రం
ఈ పత్రాలను, దరఖాస్తును పూరించి కేంద్ర లేదా ప్రాంతీయ హస్తకళల కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 15 2023