మన చేతి వేళ్ల తీరును బట్టి కూడా మన పర్సనాలిటీ ఉంటుందట.

మనుషుల చేతి వేళ్లు మూడు రకాలుగా ఉంటాయి.

మొదటి రకం: చూపుడు వేలు.. ఉంగరం వేలుకంటే ఎత్తుగా ఉంటుంది.

ఇలా చేతి వేళ్లు ఉన్న వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.

వీరికి కోపం చాలా తక్కువగా ఉంటుంది.

ఇతరుల గురించి ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటారు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టరు.

రెండో రకం : చూపుడు వేలు.. ఉంగరం వేలు రెండూ సమానంగా ఉంటాయి.

వీరు జీవితాన్ని ఎంతో బ్యాలెన్స్‌గా లీడ్‌ చేస్తారు.

ఇతరుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. తమ చుట్టూ ఉండే వారి పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారు.

వీరితో ఉన్న వాళ్లు ఎంతో సురక్షితంగా ఫీలవుతారు.

ఇతరులు వీరితో తమకు సంబంధించిన లోతైన సీక్రెట్లను చెప్పేస్తూ ఉంటారు.

మూడో రకం : చూపుడు వేలుకంటే ఉంగరం వేలు పెద్దగా ఉంటుంది.

వీరికి కాన్ఫిడెన్స్‌ చాలా ఎక్కువ. వీరు ప్రతీ అడుగు ఆచితూచి వేస్తారు.

సమస్యలకు వీరు ఎప్పుడు జంకరు. ఎల్లప్పుడూ ప్లాన్‌ బీని రెడీ పెట్టుకుని ఉంటారు.

వీరికి ఆపోజిట్‌ జెండర్‌లో ఎక్కువ పాపులారిటీ ఉంటుంది.