చాలామంది చెవిలో ఉన్న గుమిలిని బయటకు తీయడానికి ఆపసోపాలు పడుతుంటారు.

 ఈ మధ్యకాలంలో కాటన్ ఇయర్ బడ్స్ తో అందరూ క్లీన్ చేసుకుంటున్నారు.

తద్వారా చెవిపోటు, లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయినా సరే.. ఇవేం లెక్కచేయకుండా చాలా మంది కాటన్ ఇయర్ బడ్స్ తో చెవిని క్లీన్ చేసుకుంటూ అనారోగ్య పాలవుతున్నారు.

 అసలు కాటన్ ఇయర్ బడ్స్ తో చెవిని క్లీన్ చేసుకుంటే వచ్చే సమస్యలు ఏంటి?

నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

 చెవిలో ఉండే గుమిలినిని తీసేందుకు అందరూ కాటన్ ఇయర్ బడ్స్ వాడుతుంటారు.

 దీంతో చెవిలో ఉన్న ఆ గుమిలి బయటకు రాకుండా పూర్తిగా మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

 తద్వారా జిగటగా ఉండే ఈ పదార్థం గట్టిగా మారి చెవిలో అడ్డుగా మారుతుంది.

దీని కారణంగా వినికిడి లోపంతో పాటు చెవిపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీంతో పాటు లేనిపోని ఇన్ఫెక్షన్ కూడా వస్తాయని కూడా చెబుతున్నారు.

ఇదే విషయాన్ని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్ లో పబ్లిష్ చేసిన ఓ అధ్యయనంలో వెల్లడించడం విశేషం.

NOTE: ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కొరకు దగ్గరలోని వైద్యుడిని సంప్రదించండి)