టాలీవుడ్ హీరోల్లో కల్యాణ్ రామ్ కాస్త విభిన్నమనే చెప్పాలి.

రెగ్యులర్ సినిమాలు కాకుండా కథాబలం ఉన్న వెరైటీ చిత్రాలు చేసేందుకు కల్యాణ్​ రామ్ ఆసక్తి చూపిస్తుంటారు.

కంటెంట్ తర్వాతే మిగతా విషయాలకు ఈ నందమూరి హీరో ప్రాధాన్యం ఇస్తుంటారు. 

‘బాల గోపాలం’ చిత్రంతో తెరంగేట్రం చేశారు కల్యాణ్​ రామ్. ఈ మూవీలో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్​గా నటించారు. 

హీరోగా కల్యాణ్​ రామ్ చేసిన ఫస్ట్ మూవీ ‘అభిమన్యు’. అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతనొక్కడే’తో ఫస్ట్ హిట్ కొట్టారు కల్యాణ్​ రామ్.

‘అతనొక్కడే’ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికీ ఆయనకు సరైన హిట్ పడలేదు. అయితే అనిల్ రావిపూడి రూపొందించిన ‘పటాస్ ’ కల్యాణ్ రామ్ కు మరో మెగా హిట్ ను అందించింది.

గత సంవత్సరం ‘బింబిసార’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన ‘డెవిల్’ అనే ఫిల్మ్​లో యాక్ట్ చేస్తున్నారు. ’ కల్యాణ్ రామ్ కు మరో మెగా హిట్ ను అందించింది.

కల్యాణ్​ రామ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయన భార్య పేరు స్వాతి. పెద్దలు కుదిర్చిన వివాహం వీళ్లది.

కల్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయన భార్య పేరు స్వాతి. పెద్దలు కుదిర్చిన వివాహం వీళ్లది.

కల్యాణ్​ రామ్-స్వాతి దంపతులకు ఇద్దరు సంతానం. కల్యాణ్​ రామ్ భార్య వృత్తిపరంగా డాక్టర్. 

మ్యారేజ్ తర్వాత స్వాతి తన జాబ్​ను వదిలేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆమెకు ఇష్టమైన హీరో అక్కినేని నాగార్జున కావడం విశేషం.

నాగ్ యాక్ట్ చేసిన ‘మన్మథుడు’ మూవీని స్వాతి లెక్కలేనన్ని సార్లు చూశారట. 

 కాలేజ్ డేస్​లో నాగ్ చిత్రం వస్తోందంటే చాలు.. క్లాసులకు బంక్ కొట్టి మరీ ఫ్రెండ్స్​తో కలసి థియేటర్లలో వాలిపోయేవారట స్వాతి.