చిత్ర పరిశ్రమలో మంచి మనసున్న హీరోల్లో ఒకరు డార్లింగ్ ప్రభాస్. తన అవసరం ఉన్నపుడు లేదనకుండా సాయం చేసే గొప్ప మనస్సు ఆయనది.

ముఖ్యంగా పెదనాన్న నుంచి నటననే వారసత్వంగా తీసుకోకుండా..ఆతిధ్యం ఇవ్వడంలోనూ, మంచి పనులు చేయడాన్ని అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

సినిమా సభ్యులకు కానుకలు ఇవ్వటం, కడుపునిండా భోజనం పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. గతంలో చాలా సార్లు ఆయన తన చిత్ర బృందానికి కానుకలు ఇచ్చారు. 

రాథేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు సయమంలో చిత్ర బృందానికి రాడో కంపెనీ వాచీలు కానుకగా ఇచ్చారు. ఒక్కో వాచీ ధర పది వేలకు పైనే ఉంది.

ఇప్పుడు మరో సారి ఆయన తన మంచి మనసును చాటుకున్నారు. సలార్‌ చిత్ర బృందానికి మంచి కానుక ఇచ్చారట. 

ఇంతకీ సంగతేంటంటే.. ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- కేజీఎఫ్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘సలార్‌’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌ చిత్ర బృందం కోసం ఓ గొప్ప పని చేశారట.

సలార్‌ చిత్రం కోసం పని చేస్తున్న టీం సభ్యులందరి ఖాతాల్లోకి  10 వేల రూపాయల చొప్పున జమ చేశారంట. 

ఈ మేరకు ఫిల్మ్‌ సర్కిల్‌లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుండమే కాదూ.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు నెటింట్ల వైరల్ అవుతున్నాయి. 

ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తమ హీరో మంచి తనానికి తెగ ఖుషీ అయిపోతున్నారు

 ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఈ విషయమే హాట్ టాపిక్ గా మారిపోయింది.

'ఆదిపురుష్' విడుదల అవుతుండగా.. ప్రభాస్ మాత్రం 'సలార్' టీమ్ మెంబర్స్‌ని సర్ ప్రైజ్ చేసినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా లెవల్‌లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీస్తున్న 'సలార్'.. ఈ ఏడాది సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది.