ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించారు.
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించనున్న ‘ఆదిపురుష్’లో.. రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు.
టీజర్‌తో భారీ ట్రోలింగ్‌కు గురైన ‘ఆదిపురుష్’ ఈ ఏడాది సంక్రాంతికే ఆడియెన్స్ ముందుకు రావాల్సింది.
ట్రోలింగ్‌తో అలర్ట్ అయిన ఓం రౌత్ అండ్ కో.. మేకింగ్, వీఎఫ్ఎక్స్ పరంగా పలు మార్పులు చేసి మొత్తానికి సినిమాను రిలీజ్‌కు రెడీ చేశారు.
ఓం రౌత్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
ప్రభాస్ మూవీకి తెలుగు నాట భారీగా బిజినెస్ అయినట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘ఆదిపురుష్’ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.170 కోట్లకు అమ్ముడుపోయాయని టాలీవుడ్ టాక్.
ట్రైలర్స్‌తో పాటు ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘ఆదిపురుష్’పై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొనేలా చేశాయి.
టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ వచ్చే పది రోజులు పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు.
ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌ను ప్రభాస్‌కు రాసిచ్చారనే చెప్పొచ్చు.
టాక్ బాగుంటే ‘ఆదిపురుష్’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జాతర చేయడం ఖాయమనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ఇంకా థియేటర్లలోకి రాకముందే ‘ఆదిపురుష్’ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి ఏర్పడింది.
తీవ్ర పోటీ నడుమ ‘ఆదిపురుష్’ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది.
అయితే ‘ఆదిపురుష్’ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే అని సమాచారం.
ఆ లెక్కన జూన్ 16న విడుదలవుతున్న ప్రభాస్ మూవీ.. ఆగస్టు 15వ తేదీకి కాస్త అటు ఇటుగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.