గచ్చిబౌలి నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న కొల్లూరులో ప్లాట్లు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
కొల్లూరులో గజం రూ. 23 వేల నుంచి రూ. 38 వేల రేంజ్ లో ఉన్నాయి.
కొల్లూరులోనే ఆయా ప్రాంతాలను బట్టి లోయస్ట్, యావరేజ్, హయ్యెస్ట్ బడ్జెట్ లో ల్యాండ్ ధరలు ఉన్నాయి.
తక్కువ ధర ఉన్న ఏరియాల్లో గజం రూ. 23 వేలు ఉంటే యావరేజ్ ధర ఉన్న ప్రాంతాల్లో గజం రూ. 30 వేలు పలుకుతోంది.
ఎక్కువ ధర కలిగిన ఏరియాల్లో గజం రూ. 38 వేలు ఉన్నాయి.
హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఏరియాలకు, అవుటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉన్న కారణంగా కొల్లూరు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 12 కి.మీ., గచ్చిబౌలి నుంచి 15 కి.మీ., హైటెక్ సిటీ నుంచి 26 కి.మీ. దూరంలో ఉంది.
కొల్లూరులో లోయస్ట్ ధర చూసుకుంటే చదరపు అడుగు రూ. 2500 ఉంది.
2 బీహెచ్‌కేకి సరిపడా స్థలం కావాలనుకుంటే కనుక రూ. 25 లక్షలు అవుతుంది. 1 బీహెచ్‌కే స్థలం కొనాలనుకుంటే రూ. 15 లక్షలు అవుతుంది.
యావరేజ్ ధర ప్రకారం గజం రూ. 30 వేలు చొప్పున 2 బీహెచ్‌కే స్థలం కావాలనుకుంటే రూ. 30 లక్షలు అవుతుంది.
గరిష్ట ధర ప్రకారం గజం రూ. 38 వేల చొప్పున చూసుకుంటే చదరపు అడుగుకి రూ. 4200 పడుతుంది.
ఈ లెక్కన 2 బీహెచ్‌కే సరిపడా స్థలం కొనాలంటే కొల్లూరులో రూ. 42 లక్షలు అవుతుంది.
ఇక ఈ ఏరియాలో ఫ్లాట్స్ కొనాలంటే సగటున చదరపు అడుగుకి రూ. 4500 అవుతుంది. అంటే 2 బీహెచ్‌కే ఫ్లాట్ సొంతం చేసుకోవాలంటే రూ. 45 లక్షలు అవుతుంది.
తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే 2 బీహెచ్‌కే ఫ్లాట్ కి చదరపు అడుగు రూ. 3300 చొప్పున రూ. 33 లక్షలు అవుతుంది.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు.
అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.