బాలానగర్ అంటే హైదరాబాద్ లో ఉన్నది కాదు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ దగ్గరలో ఉన్న బాలానగర్.
హైదరాబాద్-బెంగళూరు హైవే మీద షాద్ నగర్ కి 15 కి.మీ. దూరంలో ఉంది బాలానగర్.
హైదరాబాద్ నుంచి 60 కి.మీ. దూరంలో ఉంది ఈ ఏరియా. గంటన్నర ప్రయాణం.
ఈ బాలానగర్ లో ప్లాట్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి.
ఈ ఏరియాలో గజం స్థలం రూ. 8500, రూ. 12 వేలు, రూ. 13 వేలు, రూ. 16 వేలు, రూ. 17 వేలు, రూ. 18 వేలు బడ్జెట్ లో ఉంది.
165 చదరపు గజాల ల్యాండ్ ని రూ. 14 లక్షలు, రూ. 19 లక్షల 80 వేల రేంజ్ లో విక్రయిస్తున్నారు.
165 గజాలు అంటే 1485 చదరపు అడుగుల విస్తీర్ణం. ఈ సైజ్ లో 3 బీహెచ్కే ఇల్లు కట్టుకోవచ్చు.
18 లక్షల బడ్జెట్ లో 150 గజాలు అంటే 1350 చదరపు అడుగుల ప్లాట్ దొరుకుతుంది.
21 లక్షల 60 వేల బడ్జెట్ పెట్టుకుంటే కనుక 180 గజాలు అంటే 1620 చదరపు అడుగుల స్థలం వస్తుంది.
26 లక్షల 40 వేల బడ్జెట్ లో 165 గజాల స్థలం వస్తుంది.
బాలానగర్ ఏరియాలోని పలు చోట్ల యజమానులు, పలు వెంచర్ కంపెనీలు విక్రయిస్తున్న ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు ఈ ఏరియాలో చదరపు అడుగు స్థలం రూ. 944 నుంచి 2 వేల లోపు ఉన్నాయి.
ఇప్పుడు పెట్టుబడి పెడితే కనుక రెండు, మూడేళ్ళలో మంచి లాభాలను పొందే ఛాన్స్ ఉంటుంది.
గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు.
అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.