తమిళ సినిమాతో హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రగతి.

మొదటి సినిమా సాధించిన విజయంతో తమిళంలో వరుసగా సినిమాలు చేశారు.

తర్వాతి కాలంలో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గటంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిపోయారు.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు.

ఆమె సినీ కెరీర్‌ ప్రారంభం అయిన కొత్తలో చాలా సార్లు అవమానాలకు గురయ్యారు.

ఓ సంఘటనపై ప్రగతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

‘‘ అప్పట్లో ఓ సినిమా సెట్ లో క్యాస్టింగ్ కౌచ్  వేధింపులకు గురయ్యా.

 తీవ్ర భావోద్వేగానికి లోనయ్యా. ఆ స్టార్ కమెడీయన్‌ మొదట్లో నాతో చాలా బాగా మాట్లాడేవాడు.

 నా విషయంలో చాలా పద్దతిగా ఉండేవాడు. ఇంతలోనే అతనికి ఏమనిపించిందో తెలియదు కానీ.. నాతో ఓ రోజు మిస్ బిహేవ్‌ చేశాడు.

అక్కడ జరిగిన సన్నివేశం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.

ఆ రోజు నాకు ఎలాంటి వర్క్ చేయాలనిపించలేదు. లంచ్ కూడా చేయలేదు. ఆఖరికి టీ కూడా తాగాలనిపించలేదు’’ అని అన్నారు.