నయనతార, విగ్నేష్‌ శివన్‌లు 2022 జూన్‌ 9న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ పెళ్లి జరిగి నిన్నటితే సంవత్సరం అవుతుంది.

ఈ నేపథ్యంలోనే ఈ జంట మొదటి పెళ్లి వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంది.

ఈ సందర్భంగా విగ్నేష్‌ శివన్‌ తన భార్యకు సరప్రైజ్‌ ఇచ్చాడు.

ఆ సర్‌ప్రైజ్‌తో నయనతార కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

నయనతార, విగ్నేష్‌లు ఓ రూములో కూర్చుని ఉండగా ఫ్లూటుతో ఓ వ్యక్తి గదిలోకి వచ్చాడు.

ఫ్లూటును ఎంతో అద్భుతంగా వాయించసాగాడు.

దీంతో నయనతార చాలా ఎమోషనల్‌ అయ్యారు.

భర్తను హత్తుకుని తన్మయంతో అలాగే ఉండిపోయారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

నయన్‌, విగ్నేష్‌ల బంధాన్ని చూసి అభిమానులు, నెటిజన్లు మురిసిపోతున్నారు.