ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీ లో స్థలం కొనాలంటే అయ్యే పని కాదు.

కానీ గచ్చిబౌలి, లింగంపల్లి, మాదాపూర్ వంటి ఏరియాలకు దగ్గరలో ఓ ఏరియా ఉంది.

ఆ ఏరియాలో బడ్జెట్ ధరకు ప్లాట్స్, ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్ నుంచి 40 కి.మీ. దూరంలో ఉన్న శంకరపల్లిలో రూ. లక్షల బడ్జెట్ లో స్థలం దొరుకుతుంది.

లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి 28 కి.మీ, కొండాపూర్, మాదాపూర్ లకి దగ్గరలో ఉంది ఈ ఏరియా.

శంకరపల్లి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ కి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంత దగ్గరలో ప్లాట్స్, ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.

ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్ కి, ఐఐటీ హైదరాబాద్ కి 20 నిమిషాల్లో చేరుకునేంత దగ్గరలో ఉన్నాయి.

శంకరపల్లి నుంచి ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్ కి 25 నిమిషాలు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గచ్చిబౌలికి 35 నిమిషాలు పడుతుంది.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ హబ్ కి 35 నిమిషాలు, హైటెక్ సిటీకి 45 నిమిషాలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 55 నిమిషాలు పడుతుంది.

పేరున్న విద్యాసంస్థలు, స్కూళ్ళు ఉన్నాయి. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి శంకరపల్లిలో ఉన్నాయి.

శంకరపల్లిలో స్థలాల రేట్లు చదరపు అడుగుకి రూ. 1750 నుంచి రూ. 3200 రేంజ్ లో ఉన్నాయి.

అంటే 1000 చదరపు అడుగుల స్థలం కొనాలనుకుంటే రూ. 17,50,000 నుంచి రూ. 32 లక్షలు అవుతుంది.

సగటున చదరపు అడుగు రూ. 1900 ఉంది. 1000 చదరపు అడుగులు/110 గజాల స్థలం కొనాలంటే కనుక రూ. రూ. 19 లక్షలు అవుతుంది.

అదే ఫ్లాట్ కొనాలనుకుంటే కనుక సగటున చదరపు అడుగుకి రూ. 3050 చొప్పున 1000 చదరపు అడుగులకి రూ. 30,50,000 అవుతుంది.

గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు.

అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.