మియాపూర్ లో 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే ఎంత కాదన్నా కనీసం రూ. 50 లక్షలు అవుతుంది.

అదే మియాపూర్ కి 18 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఏరియాలో కొంటే కనుక రూ. 14 లక్షల నుంచి రూ. 15 లక్షలు మిగులుతాయి.

హైదరాబాద్ నగరం నానాటికి విస్తరిస్తోంది. ఈ కారణంగా నగరం చుట్టూ ఉన్న ఏరియాలు నివాస స్థలాలకు అనుకూలంగా మారుతున్నాయి.

నార్త్ హైదరాబాద్ లోని మియాపూర్ దగ్గరలో రూ. 36 లక్షల బడ్జెట్ లో 2 బీహెచ్కే ఫ్లాట్స్ దొరుకుతున్నాయి.

ఇదే నార్త్ హైదరాబాద్ లో ఉన్న కూకట్ పల్లి, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ వంటి ఏరియాల్లో 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 45 లక్షల నుంచి రూ. 50 లక్షల పైనే పెట్టాల్సి ఉంటుంది.

అదే మియాపూర్ దగ్గరలో అయితే తక్కువ బడ్జెట్ కే ఫ్లాట్స్ దొరుకుతున్నాయి.

కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు తక్కువ ధరకు ఫ్లాట్స్ ని విక్రయిస్తున్నాయి.

మీరు కనుక తక్కువ పెట్టుబడితో భవిష్యత్తులో మంచి లాభాలు పొందాలి అనుకుంటున్నా లేదా బడ్జెట్ లో ఫ్లాట్ తీసుకుని ప్రశాంతంగా జీవించాలని అనుకున్నా గానీ ఇస్నాపూర్ ఏరియా చాలా అనుకూలంగా ఉంటుంది.   

ఐటీ హబ్ కి దగ్గరలో ఉన్న ఇస్నాపూర్.. మోడర్న్ ఫ్యామిలీస్ కి ఉత్తమ ఛాయిస్ గా ఉంటుంది.

ఇస్నాపూర్ లో క్వాలిటీ విద్యనందించే విద్యాసంస్థలు, హెల్త్ కేర్ సెంటర్లు, షాపింగ్ కేంద్రాలు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు ఉన్నాయి.

హైదరాబాద్ తర్వాత ఉత్తమ రెసిడెన్షియల్ హబ్ గా మారే పొటెన్షియాలిటీ ఇస్నాపూర్ కి ఉందని కొనుగోలుదారులు నమ్మి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇక్కడ బడ్జెట్ లోపే ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. భవిష్యత్తులో ఈ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి.

మియాపూర్ కి 18 కి.మీ. దూరంలో, పటాన్ చెరువుకి 6 కి.మీ. దూరంలో ఉంది ఇస్నాపూర్. ఈ ఏరియాలో 2 బీహెచ్కే ఫ్లాట్స్ రూ. 36 లక్షల నుంచి ఉన్నాయి.

గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు.

అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.