సినిమా, బుల్లితెర నటులు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. 

పెళ్లిళ్లలకు ఇది సమయం కాబట్టి..తమకు అనుకూలమైన ఓ మంచి ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకుని ఓ ఇంటివారు అవుతున్నారు.

శర్వానంద్-రక్షితా శెట్టి పెళ్లి ఈ నెలలో జరిగిన సంగతి విదితమే. అలాగే మెగా ఇంట కూడా పెళ్లి సందడి నెలకొంది. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం కూడా ఈ రోజేనని తెలుస్తోంది.

కాగా, ప్రముఖ బుల్లి తెర కమెడియన్ కూడా ఓ ఇంటి వాడయ్యాడు. 

తెలుగు బుల్లితెర కామెడీ షోల్లో ఒకటైన జబర్థస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూడా బ్యాచులర్ లైఫ్‪కు గుడ్ బై చెప్పేశాడు.

తన పెళ్లి వార్త చెబుతూనే.. అభిమాలను ఊరిస్తూ.. తనకు కాబోయే భార్య ఫోటోను మొదట రివీల్ చేయలేదు కార్తీక్.

ఆ తర్వాత ఆమె ఫోటోను షేర్ చేశారు. అప్పుడు ఆమె పేరు సిరి అని సంబోధించారు. 

కెవ్వు కార్తీక్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గురువారం కెవ్వు కార్తీక్ వివాహం హైదరాబాద్‌లో జరిగింది.

వీరి పెళ్లికి బుల్లి తెర సహ నటులు, సినీ ప్రముఖులు హాజరయ్యి నూతన దంపతులను ఆశ్వీరదించారు.

వీరి వివాహానికి గెటప్ శ్రీను దంపతులు కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని శ్రీను తన ఇన్ స్టా ఖాతాలో ఫోటో షేర్ చేసి..జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

వరంగల్‌కు చెందిన కెవ్వుకార్తీక్.. చదువు పూర్తయ్యాక సినిమాలపై మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 

మిమిక్రీ ఆర్టిస్టు అయిన కార్తీక్..  కామెడీ క్లబ్‌తో అనే ఓ షో ద్వారా కెరీర్‌ను స్టార్ చేస్తూ.. అంచలు అంచలుగా ఎదిగారు.

ఆ తర్వాత జబర్థస్త్‌లోకి ఓ కంటెస్టంట్‌గా వచ్చాడు. తన కామెడీతో నవ్వులు పూయించాడు.

అప్పుడు కొంత మంది టీమ్ లీడర్లు.. షో నుండి తప్పుకోగా.. మరో హాస్య నటుడు ముక్కు అవినాష్‌తో కలిసి టీమ్ లీడర్‌గా కొనసాగాడు. 

ముక్కు అవినాష్ కూడా తప్పుకోవడంతో.. పూర్తి స్థాయిలో టీమ్ లీడింగ్ చేపట్టి.. దూసుకుపోతున్నాడు.

ఈ బుల్లి తెర నటుడు వెండి తెరపై కూడా పలు సినిమాల్లో కనిపించాడు.

గత ఏడాది ముఖ చిత్రంలో కనిపించిన కార్తీక్.. ఇటీవల బెల్లకొండ గణేష్ సినిమా నేను స్టూడెంట్ సర్ చిత్రంలో కనిపించారు.