కానీ సొంత స్థలం ఇచ్చే కిక్కు ఫ్లాట్ ఇవ్వదు. పైగా స్థలం విలువ అనేది పెరుగుతుంది. అందుకే స్థలం కొనుక్కోవాలని భావిస్తారు.
కానీ సొంత స్థలం ఇచ్చే కిక్కు ఫ్లాట్ ఇవ్వదు. పైగా స్థలం విలువ అనేది పెరుగుతుంది. అందుకే స్థలం కొనుక్కోవాలని భావిస్తారు.
తక్కువ బడ్జెట్ లో స్థలం కొనుక్కోవాలని మీరు భావిస్తే కనుక బీబీనగర్ మంచి ఛాయిస్ అవుతుంది.
ఈస్ట్ హైదరాబాద్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్, పోచారం, కొత్తపేట్ ఏరియాల్లా బీబీనగర్ కూడా అభివృద్ధి చెందుతుంది.
పోచారం నుంచి 17 కి.మీ., బోడుప్పల్ నుంచి 26 కి.మీ., ఉప్పల్ నుంచి 28 కి.మీ. దూరంలో ఉంది బీబీ నగర్.
బీబీనగర్ కి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలు దూరమైనా గానీ గంటన్నర ప్రయాణం ఉంటుంది.
ఫ్యూచర్లో ఈ ఏరియాలో పలు కంపెనీలు, హాస్పిటల్స్, విద్యాసంస్థలు వంటివి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం బీబీనగర్ లో చదరపు అడుగు స్థలం సగటున రూ. 1350 ఉంది. 1000 చదరపు అడుగుల స్థలం కావాలనుకుంటే రూ. 13,50,000 అవుతుంది. కాస్త విశాలంగా కావాలనుకుంటే రూ. 18,22,500 అవుతుంది.
ఇదే ఏరియాలో చదరపు అడుగు స్థలం రూ. 1100, రూ. 1200, రూ. 1300, రూ. 1400, రూ. 1500 రేంజ్ లో కూడా ఉన్నాయి.
11 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో స్థలాల ధరలు ఉన్నాయి. ఒక రూ. 15 లక్షలతో స్థలం కొనుక్కుని.. రూ. 20 లక్షల్లో ఇల్లు కట్టుకుంటే సొంతింటి కల నిజమవుతుంది.
గమనిక: మాకు దొరికిన డేటా ఆధారంగా బీబీ నగర్ ఏరియాలో స్థలాల ధరలు ఇవ్వడం జరిగింది.
ఈ ధరల్లో మార్పులు అనేవి ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే ముందు రియల్ ఎస్టేట్ నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.
పై కథనం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం ఇవ్వబడింది. ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టడం పూర్తిగా మీ బాధ్యత మాత్రమే.