టాటా స్టీల్ లో శిక్షణ ఇచ్చి రూ. 30 వేలు ఉపకారవేతనం ఇవ్వడమే కాకుండా ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగం ఇచ్చి ఏడాదికి రూ. 7 లక్షల జీతం ఇవ్వనున్నారు.
బీ.ఈ./బీ.టెక్., బీ.ఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంజనీర్ ట్రైనీలుగా చేర్చుకుంటుంది టాటా స్టీల్.
ఆపరేషన్స్, మెయింటెనెన్స్, ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ ఏరియాల్లో పని చేసేందుకు ఇంజనీర్ ట్రైనీ పోస్టుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ఎంపికైన అభ్యర్థులకు ఏడాది కాలం పాటు శిక్షణ ఉంటుంది.
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు టాటా స్టీల్ లో అసిస్టెంట్ మేనేజర్ గా నియమిస్తారు.
మూడేళ్ళ పాటు పనిచేయాల్సి ఉంటుంది.
అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, సివిల్ & స్ట్రక్చరల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, సిరామిక్, కెమికల్, మెకానికల్, మెటలర్జీ, మినరల్, మైనింగ్, బెనిఫిసియేషన్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్, జీఈఓ ఇన్ఫర్మేటిక్స్ శాఖల్లో బీ.ఈ./బీ.టెక్./బీ.ఎస్సీ. (ఇంజనీరింగ్) ఫైనల్ చదువుతున్న వారు అర్హులు.
లేదా జియాలజీ, జీఈఓ ఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ విభాగాల్లో ఎంటెక్/ఎం.ఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అర్హులు.
మూడేళ్లు డిప్లొమా చదివి, ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరి నాల్గో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
ఏఐసీటీఈ/యూజీసీ ఆమోదించిన పూర్తి సమయం క్యాంపస్ ప్రోగ్రాంలో హాజరు కలిగి ఉండాలి.
జనరల్ అభ్యర్థులు: బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ లో ఖచ్చితంగా సీజీపీఏ ప్యాటర్న్ ప్రకారం కనీసం 6.5 మార్కులు లేదా 65 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ట్రాన్స్ జెండర్లు, పీడబ్ల్యూడీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ లో సీజీపీఏ ప్యాటర్న్ ప్రకారం కనీసం 6 మార్కులు ఉండాలి. లేదా 60 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు పరిమితి: జనరల్ అభ్యర్థులకు: జూన్ 01 2023 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ట్రాన్స్ జెండర్లు, పీడబ్ల్యూడీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: జూన్ 01 2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.