కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.

ఈ  ఎక్స్ ప్రెస్ ను 46 ఏళ్ల కిందటే ప్రవేశ పెట్టారు.

రైల్వే చరిత్రలో అత్యధిక స్పీడ్ తో తీసుకొచ్చిన మొట్టమొదటి రైలు కోరమాండల్ ఎక్స్ ప్రెస్.

మొదటగా ఈ రైలు ప్రారంభంలో వారానికి రెండు సార్లు మాత్రమే నడిచేది. కానీ, ఇప్పుడు రోజూ నడిపిస్తున్నారు.

ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.

ఈ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్ లోని హౌరాకు వెళ్తుంది.

ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గంటకు 130 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.

ఈ రైలు చెన్నై నుంచి హౌరా వరకు ప్రయాణంలో దాదాపు 25 గంటల్లో 16,61 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఈ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ చెన్నైలో ప్రారంభమైతే నాన్ స్టాప్ గా ఆరు గంటల్లో విజయవాడ చేరుకుని 431 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.

 కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను సౌత్ ఈస్ట్ ఈస్టర్న్ రైల్వేలో రారాజుగా పిలుస్తారు.

ఈ రైలుకు గతంలో చాలా ప్రమదాలు జరిగాయి. కానీ, శుక్రవారం జరిగింది మాత్రం రైల్వే చరిత్రలోనే అతి పెద్దది.

 కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఇప్పటి వరకు లక్షమంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చడం విశేషం.