మీకు మొబైల్ గేమ్స్ ఆడడం అంటే పిచ్చా? మొబైల్ గేమ్స్ ఆడడంలో మీరు తోపా?
ఐతే రూ. 10 లక్షలు గెలుచుకునే అద్భుతమైన అవకాశం మీ కోసమే.
18 నుంచి 25 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ చీఫ్ గేమింగ్ ఆఫీసర్ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు.
గేమ్స్ ఆడాలన్న ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరవచ్చు.
ఆడితే సరిపోదు. ఆడుతూ ఎప్పటికప్పుడు గేమ్ ప్లే మీద రివ్యూ ఇవ్వాలి.
ఐకూలోని లీడర్ షిప్ టీమ్ తో కలిసి గేమింగ్ ఇన్సైట్స్ ని షేర్ చేసుకుంటూ గేమర్స్ కోసం ఫుల్ స్మార్ట్ ఫోన్ ప్యాకేజ్ ని అందించాలి.
ఐకూ ఫోన్స్ లో రానున్న గేమ్స్ ని ఆడడంతో పాటు గేమ్ ప్లే ఎలా ఉందో రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ చీఫ్ గేమింగ్ ఆఫీసర్ రోల్ కి అప్లై చేసేవారికి భారత్ లోనే టాప్ ప్లేయర్స్ తో ఆడే అవకాశం దొరుకుతుంది.
చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కి రివార్డ్ కూడా ఇవ్వనుంది కంపెనీ.
చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కాంటెస్ట్ లో పాల్గొని 6 నెలల పాటు ఉంటే అందులో గెలిస్తే రూ. 10 లక్షలు ఇస్తుంది కంపెనీ.
ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలంటే వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
జూన్ 11 2023 వరకూ అప్లికేషన్లను స్వీకరిస్తారు.