ఈ రోజుల్లో సిగరెట్ తాగడం అనేది కొంతమంది ప్యాషన్ గా మారిపోయింది.
కొందరు ప్యాషన్ గా తాగుతుంటే, మరికొంతమంది మాత్రం అలవాటుపడి అదే పనిగా తాగుతూ ఉంటున్నారు.
దీని కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా కూడా తాగడం మాత్రం ఆపడం లేదు.
అయితే, కొంతమంది మాత్రం భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగేందుకు ఇష్టపడుతుంటారు.
ఇలా చేయడం వల్ల ప్రాణాలకే ముప్పు ఉందంటున్నారు నిపునణులు.
ఇంతకు భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి?
అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సిగరెట్ తాగడం వల్ల శ్వాస కోస సమస్యలు, గుండె సమస్యలతో పాటు ఉభయకాయం వంటి సమస్యలు వస్తాయి.
ప్రధానంగా భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగితే చాలా రకాల సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగితే తిన్న ఆహారం నుంచి శరీరం పోషకాలను గ్రహించదు.
తిన్న ఆహారం పోషకాలు గ్రహించే పక్రియ చిన్న ప్రేగులలో జరుగుతుంది.
అయితే, తిన్న వెంటనే సిగరెట్ తాగితే మాత్రం ఆహారం చిన్న ప్రేగులోకి పోషకాలు వెళ్లకుండా సిగరెట్ లోని నికొటిన్ ను ఎక్కువగా గ్రహించే అవకాశం ఉంటుంది.
దీంతో పాటు భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగితే శరీరంలోని సిగరెట్ లోని నికోటిన్ రక్తంలోని ఆక్సిజన్ లో కలుస్తుంది.
భోజనం చేసిన తర్వాత పెద్ద పేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.