ప్రముఖ చానల్‌లో ప్రసారమౌతున్న కామెడీ షోస్ అనగానే జబర్దస్, ఎక్స్ ట్రా జబర్థస్త్ జబర్దస్త్ గుర్తుకు వస్తాయి.
ఇప్పుడంటే ఆ నటులంతా ఫేమస్ అయ్యారు కానీ.. ఆ షో రావడానికి ముందు ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు.
కానీ ఈ రెండు షోలు అనేక మందికి లైఫ్ నిచ్చాయని చెప్పొచ్చు. ఈ షోలో నటించిన వారు..
ఇళ్లు, కార్లు, నగలు కొనుక్కోవడమే కాకుండా.. వెండితెరపై కూడా తమ సత్తాను చాటుతున్నారు.
అటువంటి వారిలో ఒకరు కెవ్వు కార్తీక్. చూడటానికి చాలా క్యూట్ గా కనిపిస్తాడు.
ఉన్నతమైన చదువులు చదివాడు. మంచి ఉద్యోగం వదులుకుని, సినిమాల మీద మక్కువతో హైదరాబాద్ వచ్చేశాడు
మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన అతడు.. జీ తెలుగులో 'కామెడీ క్లబ్' అనే షోతో కెరీర్ స్టార్ట్ చేశాడు కార్తీక్. ఎన్నో కష్టాలు పడి జబర్థస్త్‌లో కంటెస్టెంట్ అయ్యాడు.
కంటెస్టెంట్ నుండి టీమ్ లీడర్ స్థాయికి అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్తుతం నవ్వులు పూయిస్తున్నాడు.
కొంత మంది టీమ్ లీడర్లు వెళ్లిపోవడంతో, జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్‌గా విడిపోవడంతో ముక్కు అవినాష్‌తో కలిసి ఓ టీమ్ లీడర్‌గా మారాడు.
తర్వాత అవినాష్ కూడా వెళ్లిపోవడంతో కెవ్వు కార్తీక్ టీమ్ లీడర్ అయ్యాడు.
కెవ్వు కార్తీక్ నుండి ఓ శుభవార్తతో మన ముందుకు వచ్చాడు. త్వరలో ఆయన ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆమెతో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.
‘ మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తే.. లైఫ్ మరింత సంతోషంగా ఉంటుందని కొందరు అంటుంటారు.
అది ఇదే కావచ్చు. నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్యూ బ్యూటీఫుల్. నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఈగర్లీ ఎదురుచూస్తున్నా’ అంటూ రెండు ఫోటోలను ఇన్ స్టా లో పోస్టు చేశారు.
అయితే ఆ రెండు ఫోటోల్లో కూడా ఆమె ఎవరన్నదీ రివీల్ చేయలేదు. అయితే ఆయనకు పెళ్లి కుదిరిందని తెలిసి.. చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అదిరే అభి, జోర్దార్ సుజాత, గెటప్ శ్రీను, బిగ్‌బాస్ పింకీ, నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.