అయితే, కొంతమంది ఒకే విషయాన్ని వంద రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు.
దీన్నే అతిగా ఆలోచించటం అంటారు. ఈ అతి కారణంగా జీవితం చాలా ఇబ్బందుల్లో పడుతుంది.
అతిగా ఆలోచించటం కారణంగా శారీరకంగా, మానసికంగా చాలా నష్టాలు ఉన్నాయి.
అతిగా ఆలోచించే వారు ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు.
వీరిలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పూర్తిగా నశిస్తుంది.
ఈ అతి ఆలోచనల కారణంగా ప్రతి రోజూ కలిగే ఒత్తిళ్లను తట్టుకోవటం అస్సలు సాధ్యపడదు.
ఇలాగే ఆలోచిస్తూ ఉంటే అది ఒత్తిడిగా మారిపోతుంది.
అతిగా ఆలోచించే వారు ఏ పని మీద ఎక్కువ సేపు శ్రద్ధ పెట్టలేరు.
వీరికి నిద్ర కూడా సరిగా పట్టదు. ఆలోచనలతో తలనొస్తూ ఉంటుంది.
శారీరకంగా కూడా వీరికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుంది.