నందమూరి తారకరత్న అకాల మరణంతో.. అటు నందమూరి కుటుంబం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అయితే తన భర్తను తలుచుకుంటూ కన్నీరు పెట్టని రోజు లేదనే చెప్పాలి.

తన భర్తతో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ లు పెడుతూ.. తన బాధను తెలియజేస్తూనే ఉంది.

తాజాగా తారకరత్న మరణించి మార్చి 18కి సరిగ్గా నెల రోజులు కావొస్తుండటంతో.. సోషల్ మీడియాలో ఎమెషనల్ పోస్ట్ ను షేర్ చేసింది అలేఖ్య రెడ్డి.

నువ్వు మా నుండి దూరం అయ్యి నేటితో సరిగ్గా నెల రోజులు అవుతుంది. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను ఇప్పటికీ, ఎప్పటికీ దహించి వేస్తూనే ఉంటాయి.

ఇక మన ప్రేమ ప్రయాణంలో నేను భయంగా ఉంటే, నువ్వు మాత్రం.. మనం కచ్చితంగా కలిసి జీవించబోతున్నాం అంటూ ఎంతో ధైర్యం ఇచ్చావ్.

నీ పోరాటం ఫలితంగా మన పెళ్లి జరిగింది. అయితే మన పెళ్లి తర్వాత మనపై ఎంతో మంది వివక్ష చూపించారు.

నిషిక పుట్టాక మన లైఫ్ మారిపోయింది. మన సంతోషం రెట్టింపు అయ్యింది. కానీ మన కష్టాలు అలాగే ఉన్నాయి.

అయినవాళ్లే మనల్ని ద్వేషించారు. నీ గుండెలోని బాధను వారు ఏనాడు అర్థం చేసుకోలేదు.

మనకు కావాల్సిన వారే మనల్ని పదే పదే గాయం చేసినా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉన్నాము.

చివరగా.. నువ్వు రియల్ హీరో.. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం, మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నా అంటూ ఎమోషనల్ అయ్యింది.