90వ దశకంలో తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టాడు నటుడు పొన్నంబలం.
తమళ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన పొన్నంబలం తెలుగులో కూడా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
కొన్నాళ్ల క్రితం కిడ్నీ ఫెయిల్యూర్‌తో ఆస్పత్రిలో చేరాడు పొన్నంబలం.
పొన్నంబలం బంధువు, దర్శకుడు జగన్నాథన్ పొన్నంబలంకు కిడ్నా దానం చేసి.. అతడి ప్రాణాలు కాపాడాడు.
ఇక పొన్నంబలం చికిత్సం కోసం చిరంజీవి ఏకంగా 40 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశాడు.
కొన్ని రోజుల క్రితమే పొన్నంబలం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి.. ఇంటికి చేరుకున్నాడు.
అయితే మద్యపానం, డ్రగ్స్ వినియోగం కారణంగానే పొన్నంబలం ఆస్పత్రిలో చేరాడంటూ వార్తలు వచ్చాయి.
వాటిని ఆయన ఖండించాడు. సొంతవాళ్లే తనను చంపడానికి ప్రయత్నించడంతో.. తన ఆరోగ్యం పాడయ్యిందని తెలిపాడు.
తన తండ్రికి నలుగురు భార్యలు అని.. మూడో భార్య కొడుకు తన దగ్గర మేనేజర్‌గా చేసేవాడని చెప్పుకొచ్చాడు.
అతడు తనను చంపడానికి ట్రై చేశాడని వివరించాడు పొన్నంబలం.
ఒకసారి బీరులో విషం కలిపి తన చేత తాగించాడని వెల్లడించాడు.
అనారోగ్యం పాలైన తర్వాత తనకు ఆ విషయం తెలిసింది అన్నాడు పొన్నంబలం.
దేవుడి దయ, సన్నిహితుల సహకారంతో.. ప్రస్తుతం తాను కోలుకున్నానని వెల్లడించాడు.
తనకు సాయం చేసిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు పొన్నంబలం.