గతంలో మనం కట్టెల పొయ్యి ద్వారా వండిన ఆహారాన్ని తీసుకునేవాళ్లం.

మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రతీ ఇంట్లో సిలిండర్ ను వినియోగిస్తున్నారు. 

ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైతం కట్టెల పొయ్యితో పని లేకుండా పోయింది. 

కొంతమంది యువతి యువకులు ఉద్యోగాల కోసం నగరాల్లో ఉంటున్నారు.

బ్యాచిలర్స్ అంతా ఆహారం వండుకోవడానికి వీలుగా రైస్ కుక్కర్లపై ఆధారపడుతున్నారు.

చాలా మంది యువత రైస్ కుక్కర్లలోనే వండకుని తింటుంటారు. 

ఇలా రైస్ కుక్కర్లలో వండిన అన్నం తినడం చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

రైస్ కుక్కర్లలో వండిన అన్నం తినడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు  వస్తాయి?

అసలు నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన ఆహారం విషతుల్యంగా మారుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

అల్యూమినియంతో తయారు చేసిన ఆహారం వండడం, నిల్వ చేయడం అంత మంచిది కాదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రైస్ కుక్కర్ లో వండిన ఆహారం తినడం ద్వారా కీళ్లవాతం, గ్యాస్ సమస్యలు, మధుమేహం సమస్యలు వస్తాయి. 

ఇవే కాకుండా మధుమేహం, అధిక బరువు, నడుము నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇలా అనేక రాకల అనారోగ్య సమస్యలకు కారణమయ్యే రైస్ కుక్కర్లను వాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.