వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి  భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులతో సత్కరిస్తారు.

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 106 మందిని పద్మ అవార్డులతో సత్కరించింది. 

పద్మవిభూషణ్  6 మంది, పద్మ భూషణ్  9 మంది, పద్మశ్రీ అవార్డులకు 91 మంది ఎంపికయ్యారు.

అలానే ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు పద్మ అవార్డులు అందుకున్నారు.

అయితే పద్మశ్రీ అవార్డు అందుకున్న ఓ వ్యక్తి సంతోషంతో పాటు తన  ఆవేదనను వ్యక్తం చేశారు.

పద్మశ్రీ అవార్డు అందుకున్న తన ఆర్థిక పరిస్థితి మారలేదంటూ  ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆయన ఎవరో కాదు పశ్చిమ బెంగాల్ కు చెందిన 'సరిందా' వాయిద్యకారుడు మంగళ కంటి రాయ్. 

101 ఏళ్ల వయస్సులో ఒంటరిగా జీవిస్తున్న ఎంతో మనోవేదనకు గురవుతున్నారు.

పశ్చిమ బెంగాల్ కు చెందిన మంగళకంటి రాయ్  'సరిందా' వాయిద్యకారుడు. 

మంగళకంటి రాయ్ నాలుగేళ్ల వయస్సులోనే  సరిందా వాయిద్యాన్ని ప్లే చేయడం నేర్చుకున్నాడు.

ముగ్గురు  కుమారులు ఓ కూతురు ఉన్నా కూడా ఆయన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. 

పద్మశ్రీ రావడం చాలా సంతోషంగా ఉందని, అయితే ఇది తన ఆర్థిక స్థితిని ఏమాత్రం మార్చలేదని అన్నారు.

నమ్ముకున్న కళ.. తనకు ఆర్థికంగా సాయపడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కోవిడ్ మహామ్మారి కారణంగా తన జీవితం అస్తవ్యస్తమైందని మంగళ కంటిక రాయ్ అన్నారు.

రెండేళ్ల నుంచి ప్రదర్శనలకు ఎవరు పిలవడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

పిల్లలు ఉన్నా కూడా జీవితం చివరి దశలో ఒంటరిగా గడుపడం చాలా బాధగా ఉందన్నారు. 

ఇలా అనేక బాధలు పడకుండా లోకాన్నే విడవాలనుకుంటున్నానంటూ మంగళ కంటి రాయ్ బాధపడ్డారు.