ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు.
ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ప్రపంచ నెం.1 బ్యాటర్‌గా ఉన్నాడు.
రవీంద్ర జడేజా చాలా కాలంగా టీమ్‌లో లేకపోయినా.. టెస్టుల్లో వరల్డ్ నెం.1 ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు.
తాజాగా మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ వన్డేల్లో వరల్డ్ నెం.1 బౌలర్‌గా నిలిచాడు.
ఆసీస్ బౌలర్ హెజల్‌వుడ్‌ను వెనక్కి నెట్టి 729 పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిరోహించాడు.
దీంతో మూడు ఫార్మాట్లలో ఏదో ఒక విభాగంలో భారత ప్లేయర్ నంబర్ వన్‌గా ఉన్నాడు.
జట్టు పరంగా కూడా భారత్ దుమ్ములేపుతోంది.
ఇప్పటికే టీ20ల్లో టీమిండియా వరల్డ్ నెం.1 టీమ్‌గా ఉంది.
తాజాగా న్యూజిలాండ్‌పై సిరీస్ విజయంతో వన్డేల్లో నెం.1 టీమ్‌గా అవతరించింది.
అలాగే టెస్టుల్లో ప్రపంచ నెం.2గా ఉంది.
టెస్టుల్లో రిషభ్ పంత్ టీమిండియా తరఫున నెం.1 బ్యాటర్‌గా ఉన్నాడు.
అలాగే వన్డేల్లో భారత్ తరఫున శుబ్‌మన్ గిల్ నెం.1 బ్యాటర్‌గా దూసుకొచ్చాడు.
టెస్టుల్లో ప్రపంచ నెం.2 ఆల్‌రౌండర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు.
వన్డేల్లో టాప్ 10 బ్యాటర్ల జాబితాలో కోహ్లీ 7వ స్థానంలో, రోహిత్ శర్మ 9వ స్థానంలో ఉన్నారు.