సమాజం కోసం ఆలోచించి.. నిజాయతీగా పని చేసే అధికారులకు మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో.. ఐఏఎస్‌ రాజు నారాయణ స్వామి జీవితం చూస్తే అర్ధం అవుతుంది.

ఇండియాలోని అవినీతితో పోరాటం చేయలేక అలసిపోయిన.. ఆయన ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేయడానికి వెళ్తున్నాడు.

ఈ విషయం తెలిసి ప్రజలు, ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తుంటే.. అవినీతిపరులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

అవినీతిపరుల పట్ల సింహస్వప్నంగా నిలిచిన రాజు నారాయణ స్వామి.. తన 20 ఏళ్ల సర్వీస్‌లో ఏకంగా 22 సార్లు బదిలీ అయ్యాడు.

రాజు నారాయణ స్వామిది కేరళ, పాల్ఘాట్‌. చిన్నతనం నుంచి చదువులో ఎప్పుడు ఫస్టే.

1983లో పదో తరగతి, ఆ తర్వాత ఇంటర్‌​.. తర్వాత చెన్నై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశాడు. అన్ని తరగతుల్లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు.

గేట్‌ ర్యాంక్‌ సాధించాడు. రాజు నారాయణకు ఎన్నో అమెరికన్‌ కంపెనీలు జాబ్‌ ఆఫర్‌ చేశాయి.

కానీ ఆయన అవేవి వద్దనుకున్నాడు. ఇక్కడే ఉంటూ దేశ ప్రజలకు సేవ చేయాలని భావించాడు.

ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అయ్యాడు. మంచి ర్యాంక్‌ సాధించాడు. ట్రైనింగ్‌లో కూడా ఫస్టే వచ్చాడు

ఎన్నో ఆశలతో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని చూసి చలించిపోయాడు.

తాను పని చేస్తున్న దగ్గర అవినీతికి తావు లేకుండా చూసుకునేవాడు.  ఇక విధినిర్వహణలో ఆయనకు మన, పర బేధం ఉండేది కాదు.

ఈ క్రమంలో తన భార్య తండ్రి.. రోడ్డుకు అడ్డంగా బిల్డింగ్‌ కడితే.. దాన్ని కూలదోశాడు. ఫలితంగా భార్య ఆయనను వదిలేసి వెళ్లిపోయింది.

లిక్కర్‌ స్కాం, చెరువు కట్టలు ఇలా ఏ పని తీసుకున్నా.. అవినీతిని ప్రశ్నించేవాడు. ఫలితంగా ట్రాన్స్‌ఫర్లు. అలా 22 సార్లు బదిలీ అయ్యాడు

ఆయన తీరుకు భయపడి.. ముఖ్యమంత్రి అచ్చుతానందన్‌.. ఆయనను ప్రాధాన్యం లేని శాఖకు బదిలీ చేశాడు.

మన పాలకులకు కంఠగింపుగా మారిని రాజు నారాయణ స్వామి నిజాయతీని ఐక్యరాజ్య సమితి గుర్తించింది.

తమతో కలిసి పనిచేయడానికి రావాల్సిందిగా.. రాజు నారాయణకు ప్రత్యేక ఆహ్వానం పంపింది.

ఏళ్లుగా ఇక్కడ అవినీతితో పోరాటం చేసి అలసిపోయిన.. రాజు నారాయణ స్వామి.. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఫ్రాన్స్‌లో పని చేయడానికి వెళ్తున్నాడు.