మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారపదార్ధాలు తీసుకోవాలి.
ఆరోగ్యంతో పాటు శరీర పెరుగుదలకు సరైన మోతాదులో పోషకాలు తీసుకోవాలి.
మన ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మొలకలు కీలక పాత్ర పోషిస్తాయి.
మొలకల్లో పిండి పదార్ధాలు, విటమిన్ బి6 సమృద్ధిగా లభిస్తుంది.
ఆహారంలో తప్పని సరిగా చేర్చుకోవాల్సిన శాఖాహార ప్రోటీన్ పదార్ధాల్లో మొలకలు ఒకటి.
అయితే చాలా మంది మొలకలు తినడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.
మరికొందరికేమో మొలకలు పచ్చిగా తినాలా? ఉడికించి తినాలా? అనే సందేహం కలుగుతుంది.
ఎలా తిన్నా మొలకల నుండి శరీరానికి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
మొలకలను ఉదయం అల్పహారంగా తీసుకుంటే కడుపు నిండిన భావన ఉండి తొందరగా ఆకలి వేయదు.
మొలకల్లో కొవ్వు, కే లరీలు తక్కువగా ఉండుట వలన బరువు తగ్గే వారికీ మంచి ఆహారం.
రాత్రి భోజనంలో మొలకలు తింటుంటే జీవక్రియలను వేగవంతం చేయటంలో సహయపడతాయి.
మొలకలు తిన్న తర్వాత మీకు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వచ్చినట్లైతే వాటిని పచ్చిగా తినొద్దు.
కొన్నిసార్లు బాక్టీరియా బారిన పడిన మొలకలు తినడం వలన ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపిస్తాయి.
మొలకెత్తిన విత్తనాలు వాసన వస్తుంటే వాటిని తినకపోవడం మంచిది.
ఇలా చేయడం ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం తప్పుతుంది.
నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్ల, నిపుణుల సలహాలు తీసుకోండి.