మాములుగా మనం రెస్టారెంట్ లో నాన్ వేజ్ తిన్న తర్వాత సోంపు గింజలు ఇస్తుంటారు.
తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సోంపు గింజలు తీసుకుంటారని చాలా మంది భావిస్తూ ఉంటారు.
కానీ సోంపు గింజలు తినడం ద్వారా ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న సంగతి ఎవరికీ తెలియదు.
అసలు సోంపు గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
అసలు నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు గింజలలో ఐరనె, సోడియం, కాల్షియం, పొటాషియం వంటివి ఉంటాయి.
సోంపు గింజలు రోజూ తీసుకోవడం ద్వారా అధిక రక్త పోటును అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడుతుంది.
సోంపు తినడం ద్వారా ఒంటికి చలువను ఇవ్వడంతో పాటు శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
మతిమరుపుతో బాధపడేవారు సైతం రోజు సోంపు గింజలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయట
అధిక బరువుతో బాధపడేవారు సోంపు గింజలు తీసుకోవడం వల్ల కొంత మార్పు కనిపిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
నోటిలో దుర్వాసన వస్తే సోంపు గింజలు తినడం వల్ల కొంత వాసనను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఖాళీ కడుపుతో సోంపు గింజలు తీసుకోవడంతో రక్తంలో మలినాలు తొలగిపోతాయి.
నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్ల, నిపుణుల సలహాలు తీసుకోండి.